KKR vs PBKS, IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం

Kolkata Knight Riders vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 42వ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

KKR vs PBKS, IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
Kolkata Knight Riders vs Punjab Kings
Follow us
Basha Shek

|

Updated on: Apr 26, 2024 | 7:24 PM

Kolkata Knight Riders vs Punjab Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 42వ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అంటే మొదట కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కు దిగనుంది. కాగా వరుసగా 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు ఎలాగైనా గెలవాలి, లేకపోతే ప్లేఆఫ్‌కు వెళ్లడం మరింత కష్టమవుతుంది. ఇక 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న కోల్ కతా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.  KKR  లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్‌ లు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఇక పంజాబ్‌కు  విదేశీ ఆటగాళ్ల నుండి మంచి ప్రదర్శన అవసరం

  • ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పంజాబ్ కింగ్స్‌కు తిరిగి వచ్చాడు, అయితే లియామ్ లివింగ్‌స్టన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.
  • కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను తొలగించగా, అతని స్థానంలో దుష్మంత చమీరకు స్థానం కల్పించింది.
  • KKR తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును కేవలం 1 పరుగుతో  ఓడించగా, పంజాబ్ చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడిపోయింది.
  • కోల్ కతా ఖాతాలో 10 పాయింట్లు ఉండగా ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కేవలం 2 విజయాలు సాధించి 9వ స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్

కోల్ కతా ప్లేయింగ్ ఎలెవన్.

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్ ), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా

ఇంపాక్ట్ ప్లేయర్ :

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్

పంజాబ్ కింగ్స్  ప్లేయింగ్ ఎలెవన్

జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్ :

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిషి ధావన్, విధ్వత్ కావరప్ప, శివమ్ సింగ్, ప్రిన్స్ చౌదరి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.