Krunal Pandya: రెండోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రెండోసారి తండ్రి గా ప్రమోషన్ పొందాడు. కృనాల్ సతీమణి పంఖూరి షర్మ ఈనెల 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ తీపి వార్తను కృనాల్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు అన్ని జట్లు ప్లేఆఫ్స్ కోసం పోరాడుతున్నాయి. టోర్నీలో భాగంగా మరికాసేపట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు, క్రికెటర్ సోదరులు పాండ్యా ఫ్యామిలీ నుంచి ఒక శుభవార్త వచ్చింది. పాండ్య కుటుంబంలోకి ఓ చిన్న అతిథి వచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రెండోసారి తండ్రి గా ప్రమోషన్ పొందాడు. కృనాల్ సతీమణి పంఖూరి షర్మ ఈనెల 21న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ తీపి వార్తను కృనాల్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. కృనాల్ మొత్తం 3 ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో కృనాల్, పంఖురి ఎంతో ఆనందంగా కనిపించారు. ఈ దంపతులకు ఇది వరకే కవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఫొటోల్లో తమ్ముడిని చూస్తూ కవీర్ మురిసిపోతుండడం మనం చూడవచ్చు. కాగా కృనాల్ దంపతులు తమ బిడ్డకు వాయు అని నామకరణం చేశారు.
ప్రస్తుతం కృనాల్ దంపతులు షేర్ చేసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. టీమిండియా క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కృనాల్ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
కృనాల్ పాండ్యా షేర్ చేసిన పోస్ట్ ఇదిగో..
Vayu Krunal Pandya 21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm
— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024
కృనాల్, పంఖురి ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. వివాహమైన 5 సంవత్సరాల తరువాత వారికి కవీర్ అనే కుమారుడు పుట్టాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత కృనాల్ మళ్లీ తండ్రి అయ్యాడు. వాయు జన్మించిన 5 రోజుల తర్వాత కృనాల్ ఈ తీపి వార్తను తన అభిమానులతో పంచుకున్నాడు.
Unfortunately we couldn’t reach our ultimate goal of winning the IPL, but rest assured we will come back stronger.
It has been a privilege to be a part of and have the opportunity to lead this team. A huge thank you to our fans for always having our back🫡💙 See you next… pic.twitter.com/8q7HnPOiel
— Krunal Pandya (@krunalpandya24) May 25, 2023
ఐపీఎల్ 17వ సీజన్‌లో కృనాల్ ఇప్పటి వరకు లక్నో తరఫున మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 8 మ్యాచ్‌ల్లో కృనాల్ 5 వికెట్లు తీశాడు. అలాగే 5 ఇన్నింగ్స్‌ల్లో 58 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కృనా అత్యధిక స్కోరు 43. అలాగే, కృనాల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 121 మ్యాచ్‌ల్లో 1 హాఫ్ సెంచరీతో 1, 572 పరుగులు చేశాడు. 75 వికెట్లు కూడా తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.