T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ సింగ్‌ కు కీలక బాధ్యతలు

IPL 17వ సీజన్ ఉత్కంఠగా జరుగుతుంది. ఈ ధనాధన్ లీగ్ ముగిసిన మరికొన్ని రోజులకే ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.  ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ సింగ్‌ కు కీలక బాధ్యతలు
Yuvraj Singh
Follow us

|

Updated on: Apr 26, 2024 | 6:28 PM

IPL 17వ సీజన్ ఉత్కంఠగా జరుగుతుంది. ఈ ధనాధన్ లీగ్ ముగిసిన మరికొన్ని రోజులకే ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.  ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ 20 జట్లను 5-5 ప్రాతిపదికన 4 గ్రూపులుగా విభజించారు. ఈ 20 జట్లు మే 1లోగా ప్రపంచకప్‌కు తమ ఆటగాళ్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ప్రపంచకప్‌లో టీమిండియాలో ఎవరికి అవకాశం దక్కుతుంది? దీనిపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి? సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అదేంటంటే.. టీ 20 ప్రపంచకప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఐసీసీ. యువరాజ్‌తో పాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమితులయ్యారు.

ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు..

టీ 20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం కావడంపై యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘క్రికెట్‌లో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అందులో కొన్ని టి20 ప్రపంచకప్‌లోని జ్ఞాపకాలు కూడా. ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడం ఈ టీ20 ప్రపంచకప్‌ లోనే జరగడం నేనెప్పుడూ మర్చిపోలేను. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను” అని యువరాజ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ తొలిసారిగా 2007లో దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించింది. అప్పట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఫైనల్ మ్యాచ్‌లో ఓడించి జగజ్జతగా నిలిచింది భారత్ . ఇదే ప్రపంచ కప్ లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. యువరాజ్ కొట్టిన ఈ 6 సిక్సర్లు ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటాయి.

టీమ్ ఇండియా వరల్డ్ కప్ షెడ్యూల్

మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా గ్రూప్-ఎలో ఉంది. టీమ్ ఇండియాతో పాటు ఈ గ్రూప్‌లో అమెరికా, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు 4 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి
  • భారత్ వర్సెస్ ఐర్లాండ్, జూన్ 5
  • భారత్ వర్సెస్ పాకిస్థాన్, జూన్ 9
  • భారత్ వర్సెస్ USA, జూన్ 12
  • వర్సెస్ కెనడా, జూన్ 15

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?