AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs RCB, IPL 2024: కోహ్లీ ముఖంలో నవ్వులే నవ్వులు.. కావ్య పాప ఫేస్‌లో కోపం, నిరాశ.. వీడియో చూశారా?

ఈ సీజన్‌లో భారీ స్కోర్లతో బెంబేలెత్తిస్తోన్నసన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది . విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ఎస్ఆర్‌హెచ్ను ఫాప్‌ డుప్లెసిస్‌ బృందం బోల్తా కొట్టించింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఒక్కొక్క వికెట్ పతనం అవుతుండటంతో ఉప్పల్ మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది

SRH vs RCB, IPL 2024: కోహ్లీ ముఖంలో నవ్వులే నవ్వులు.. కావ్య పాప ఫేస్‌లో కోపం, నిరాశ.. వీడియో చూశారా?
Virat Kohli, Kavya Maran
Basha Shek
|

Updated on: Apr 26, 2024 | 4:54 PM

Share

ఐపీఎల్ 2024 సీజన్‌లో భారీ స్కోర్లతో బెంబేలెత్తిస్తోన్నసన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది . విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ఎస్ఆర్‌హెచ్ను ఫాప్‌ డుప్లెసిస్‌ బృందం బోల్తా కొట్టించింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఒక్కొక్క వికెట్ పతనం అవుతుండటంతో ఉప్పల్ మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది . ముఖ్యంగా ఎస్ ఆర్ హెచ్ ఓనర్ కావ్య మారన్ ముఖంలో బాధ, కోపం, నిరాశ.. ఇలా అన్ని హావభావాలు కనిపించాయి. అదే సమయంలో చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ముఖంలో నవ్వులు వెల్లివిరిశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముంఉదగాబ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశాడు. ఫాప్ 208 స్ట్రైక్ రేట్ తో 25 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టుకు ఆసరాగా నిలిచాడు. గ్రీన్ 37 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. అయితే ఫినిషర్ దినేశ్ కార్తీ క్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చివరకు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 206 పరుగులు చేసింది.

మొదట బ్యాటింగ్ లో అదరగొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ మంచి ప్రదర్శన కనబరిచారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోన్న ట్రావిడ్ హెడ్ ను కేవలం ఒక్క పరుగుకే అవుట్ చేశారు. మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసన్ ఏడు పరుగులకు పెవిలియన్ పంపించారు. అభిషేక్ శర్మ, ఐడెన్ మర్కరమ్, నితీశ్ కుమార్ రెడ్డి.. ఇలా డ్యాషింగ్ ప్లేయరంతా తక్కువ స్కోరుకే SRH CEO కావ్య మారన్ ముఖం పాలిపోయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ రెడ్డి రివర్ స్వీప్ కు వెళ్లి బౌల్డ్ అవ్వడం తో కావ్య మారన్ కోపంతో ఊగిపోయింది. ఇదే మ్యాచ్ లో చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంతో కనిపించాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం వీరిద్దరి ఎక్స్ ప్రెషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలువుతన్నాయి. కాగా ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు మూడో ఓటమిని చవిచూసింది. RCB రెండో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ, కావ్యా పాపల ఎక్స్ ప్రెషన్స్.. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by AMPLI BEATS (@amplibeats)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.