Leopard Attacked on Ex-Cricketer: మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడు కుక్క!
జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేసింది. ట్రెక్కింగ్ కు వెళ్లిన గై విట్టాల్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతని పెంపుడు కుక్క రావడంతో గై విట్టాల్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన జింబాబ్వేకి ఆగ్నేయ లోవెల్డ్‌లోని హ్యుమని ప్రాంతం లో చోటుచేసుకుంది..
జింబాబ్వే, ఏప్రిల్ 26: జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేసింది. ట్రెక్కింగ్ కు వెళ్లిన గై విట్టాల్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సరిగ్గా అదే సమయానికి అతని పెంపుడు కుక్క రావడంతో గై విట్టాల్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన జింబాబ్వేకి ఆగ్నేయ లోవెల్డ్‌లోని హ్యుమని ప్రాంతం లో చోటుచేసుకుంది.
ఈ వారం ప్రారంభంలో గై విట్టాల్ తన పెంపుడు కుక్క చికారాతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో అతడిపై ఓ చిరుత మెరుపు దాడి చేసింది. సరిగ్గా అదే సమయానికి అతని పెంపుడు కుక్క చికారా రావడంతో గై విట్టాల్‌కు ప్రాణాపాయం తప్పింది. వెంటనే అప్పమత్తమైన చికారా ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి విట్టాల్‌ను రక్షించింది. చికారా దాటికి చిరత పారిపోయింది. తీవ్రగాయాలపాలైన చికారాతో పాటు విట్టాల్‌ను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా, విట్టాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని విట్టాల్ భార్య హన్నా స్టూక్స్-విట్టాల్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్టులో విట్టాల్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. చిరుత దాడిలో విట్టాల్ చేతికి, కాళ్లకు, తలకు బలమైన గాయాలు కావడంతో చాలా రక్తం పోయిందని, హిప్పో క్లినిక్ వైద్య సిబ్బంది విట్టాల్‌కు సమయానికి చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం మరొక ఆస్పత్రికి తరలించినట్లు పోస్టులో వెల్లడించింది. ఈ పోస్టులో ఆస్పత్రి బెడ్‌పై విట్టాల్ గాయాలకు కట్లుతో కనిపించాడు. మరొక ఫొటోలో బెడ్‌పై థంబ్స్-అప్ చూపిస్తూ కనిపించాడు.
కాగా గతంలోనూ విట్టాల్‌పై అడవి జంతువులు దాడి చేశాయి. అతను నిద్రిస్తున్న మంచం కింద దాదాపు 8 అడుగుల మొసలి పడుకుని ఉండటం వారి ఇంట్లోని పని మనిషి చూసింది. నదిలో నుంచి అతని ఇంట్లోకి ప్రవేశించడం, దాని నుంచి విట్టాల్ ప్రాణాలతో బయటపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది జరిగిన 11 యేళ్ల తర్వాత ఇప్పుడు చిరుత దాడి చేసింది.
Talk about monsters under your bed. Guy Whittall said he was unaware a 8-foot crocodile was in his hotel room in Zimbabwe. In fact, it wasn’t until the next day during breakfast that Guy Whitall was alerted to the presence of the 330-pound Nile croc by screams of his housemaid. pic.twitter.com/JtOlgzyW3s
— missmaybell (@missmaybell) September 19, 2019
కాగా మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్ 1993 నుంచి 2003 వరకు 46 టెస్టులు, 147 ఓడీఐలు ఆడాడు. అతను అంతర్జాతీయ స్థాయిలో 5వేల పరుగులు, 139 వికెట్లు సాధించి ఆల్ రౌండర్‌గా నిలిచాడు. ఆ తర్వాత క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన విట్టాల్ సఫారీ బిజినెస్ ప్రారంభించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.