AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్.. టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.!

ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయినప్పటికీ.. ఇప్పుడు అందరి నోటా మెదులుతున్న మాట టీ20 ప్రపంచకప్. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు టీమిండియా జట్టులో ఎవరెవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో క్యాష్ రిచ్ లీగ్..

సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్.. టీ20 ప్రపంచకప్ జట్టు ఇదే.!
Team India
Ravi Kiran
|

Updated on: Apr 26, 2024 | 3:23 PM

Share

ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయినప్పటికీ.. ఇప్పుడు అందరి నోటా మెదులుతున్న మాట టీ20 ప్రపంచకప్. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌కు టీమిండియా జట్టులో ఎవరెవరు ఎంపికవుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో క్యాష్ రిచ్ లీగ్ నుంచి యువ ఆటగాళ్లు దుమ్ములేపే పెర్ఫార్మన్స్‌లతో అదరగొడుతున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ ఇలా టీ20 ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్ స్థానానికి పోటీ ఎక్కువ ఉంది. వీరిలో ఎవరి పొజిషన్ ఖరారవుతుంది అని సస్పెన్స్ కొనసాగుతోంది. దీనితో తాజాగా ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చేసింది.

ఇటీవల ఢిల్లీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లతో సమావేశమైన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. ప్రధాన వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను.. అలాగే సంజూ శాంసన్, దినేష్ కార్తీక్‌లను కాదని రెండో వికెట్ కీపర్ స్థానంలో కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డీకేకు వయస్సు మీద పడటం, అలాగే సంజూ శాంసన్ కంటే మెగా టోర్నీలలో ఆడిన అనుభవం రాహుల్‌కి ఉండటం.. ఏ పొజిషన్‌లోనైనా రాహుల్ పరుగులు సాధిస్తుండటం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుని.. అతడివైపే మొగ్గు చూపారట కెప్టెన్, కోచ్, చీఫ్ సెలెక్టర్. పేసర్లుగా బుమ్రా, అర్ష్​దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇక స్పిన్నర్ల కోటాలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఫైనలైజ్ కాగా, ఇంకో స్పాట్ కోసం రవి బిష్ణోయ్, అవేశ్​ ఖాన్, అక్షర్ పటేల్​ మధ్య పోటీ కొనసాగుతోంది. కాగా, సంజూ శాంసన్, దినేష్ కార్తీక్‌లకు మరోసారి బీసీసీఐ హ్యాండ్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి అసలు స్క్వాడ్ ఎలా ఉండబోతోందో.. తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.