AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ఏడు సీజన్లలో 500కు పైగా రన్స్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఆ డ్యాషింగ్ బ్యాటర్ రికార్డు సమం

ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంగా అజేయంగా 70 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఈ రన్స్ తో మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడీ రన్ మెషిన్.

IPL 2024: ఏడు సీజన్లలో 500కు పైగా రన్స్.. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఆ డ్యాషింగ్ బ్యాటర్ రికార్డు సమం
Virat Kohli
Basha Shek
|

Updated on: Apr 29, 2024 | 8:15 AM

Share

ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంగా అజేయంగా 70 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఈ రన్స్ తో మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడీ రన్ మెషిన్. అదేంటంటే.. గుజరాత్ టైటాన్స్‌పై 70 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఈ ఐపీఎల్ సీజన్‌లో 500 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు జరిగిన 17 ఎడిషన్లలో విరాట్ కోహ్లి 7 సీజన్లలో 500 పరుగుల మార్కును దాటాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధికంగా 500కుపైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్ర స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ రికార్డును కోహ్లీ సమం చేశాడు.

వార్నర్ ఐపీఎల్‌లో 7 సార్లు 500 ప్లస్ పరుగులు సాధించాడు. ఇప్పుడు గుజరాత్ పై 70 పరుగులు సాధించడం తర్వాత వార్నర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి అజేయ అర్ధ సెంచరీని నమోదు చేయడమే కాకుండా విల్ జాక్స్‌తో కలిసి కేవలం 74 బంతుల్లో 166 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లిలా అజేయంగా నిలిచిన జాక్స్ కూడా ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ విజయ దరహాసం.. వీడియో

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

గుజరాత్ టైటాన్స్ –

వృద్ధిమాన్ సాహా(కీపర్), శుబ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సందీప్ వారియర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు..

అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..