T20 World Cup 2024: గిల్, కేఎల్ రాహుల్‌లకు మొండి చేయి.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది దృష్టి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు తుది గడువు
ఐపీఎల్ 2024 మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది దృష్టి ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు తుది గడువుగా సమయం ఇచ్చింది ఐసీసీ. దీంతో బీసీసీఐ కూడా టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసే పనిలో బిజిబిజీగా ఉంది. సోమవారం లేదా మంగళవారం భారత జట్టు ప్రకటన ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ప్రపంచకప్ లో టీమిండియా ఎంపిక గురించి మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా భారత జట్టు ఎంపిక గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఈ మెగా ఐసీసీ టోర్నీ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ఎంపిక చేశాడు. చాలా మంది లాగే జాఫర్ కూడా టాపార్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లకు స్థానం కల్పించాడు. అయితే టీమిండియా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ కు తన జట్టులో ప్లేస్ ఇవ్వలేదు జాఫర్.
ఇక వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు స్థానం కల్పించిన జాఫర్.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపాడు. ఆల్ రౌండర్ల కోసం హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాడు. అలాగే నయా ఫినిషర్ రింకూ సింగ్ ను కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. జస్ ప్రీత్ బుమ్రాతో పాటు మహహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ లకు తన జట్టులో చోటు ఇచ్చాడు. స్పిన్నర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కు పెద్ద పీట వేశాడు. ఆర్సీబీ ఫినిషర్ దినేశ్ కార్తీక్, రాజస్థాన్ సెన్సేషన్ రియాగ్ పరాగ్, లక్నో స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ ల ను పక్కన పెట్టేశాడు జాఫర్.
My India squad for T20 WC:
1. Rohit (C) 2. Jaiswal 3. Kohli 4. SKY 5. Pant (WK) 6. Samson (WK) 7. Hardik 8. Dube 9. Rinku 10. Jadeja 11. Kuldeep 12. Chahal 13. Bumrah 14. Siraj 15. Arshdeep
What’s yours? #T20WorldCup
— Wasim Jaffer (@WasimJaffer14) April 28, 2024
టీ20 ప్రపంచకప్-2024 కోసం వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..