IND vs BAN: బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం.. రెండో మ్యాచ్ ఎప్పుడంటే?

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు పురుషులతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌ వేదికగా ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఆడనుంది

IND vs BAN: బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం.. రెండో మ్యాచ్ ఎప్పుడంటే?
Indw Vs Banw
Follow us

|

Updated on: Apr 28, 2024 | 9:10 PM

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు పురుషులతో పాటు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌ వేదికగా ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం (ఏప్రిల్ 28) జరిగింది. భారత్‌ టాస్‌ గెలిచి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు డీలా పడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్‌కు నిరాశాజనక ఆరంభం లభించింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్మృతి మంధాన 9 పరుగులు చేసి పెవిలియన్ చేరుకుంది. ఆ తర్వాత షఫాలీ వర్మ, యాస్తికా భాటియా స్కోరును ముందుకు తీసుకెళ్లారు. షఫాలీ వర్మ 31 పరుగుల వద్ద ఔట్ కాగా, యస్తికా భాటియా 36 పరుగులు చేసి ఔటైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 బంతుల్లో 30 పరుగులు చేయగా, రిచా ఘోష్ 17 బంతుల్లో 23 పరుగులు చేసింది. ఎస్ సంజన 11 పరుగులు చేయగా, పూజా వస్త్రాకర్ 4 పరుగులతో పెవిలియన్ బాట పట్టింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగుల నామ మాత్రపు స్కోరు సాధించింది. బ్యాటింగ్ లో తేలిపోయిన భారత అమ్మాయిలు బౌలింగ్ లో అదర గొట్టారు. ముఖ్యంగా రేణుకా ఠాకూర్ సింగ్‌ కేవలం 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. పూజా వస్త్రాకర్ 2 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 1 వికెట్, దీప్తి శర్మ 1 వికెట్, రాధా యాదవ్ 1 వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం (ఏప్రిల్ 30)న జరగనుంది.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల XI ప్లేయింగ్

బంగ్లాదేశ్ మహిళలు (ప్లేయింగ్ XI): దిలారా అక్టర్, ముర్షిదా ఖాతూన్, షోర్నా అక్టర్, నిగర్ సుల్తానా (వికెట్ కీపర్/కెప్టెన్), ఫహిమా ఖాటూన్, రబెయా ఖాన్, శోభనా మొస్తరి, నహిదా అక్టర్, సుల్తానా ఖాటూన్, మారుఫా అక్టర్, ఫరీహా త్రిస్నా.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాష్టికా భాటియా, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ఎస్ సజ్నా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్, రాధా యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..