CSK vs SRH, IPL 2024: చెన్నై బదులు తీర్చుకునేనా? టాస్ గెలిచిన హైదరాబాద్.. జట్టులోకి మరో స్టార్ బ్యాటర్

Chennai Super Kings vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 46వ మ్యాచ్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో రెండు జట్లూ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి

CSK vs SRH, IPL 2024: చెన్నై బదులు తీర్చుకునేనా? టాస్ గెలిచిన హైదరాబాద్.. జట్టులోకి మరో స్టార్ బ్యాటర్
Chennai Super Kings vs Sunrisers Hyderabad
Follow us
Basha Shek

|

Updated on: Apr 28, 2024 | 7:26 PM

Chennai Super Kings vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 46వ మ్యాచ్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. దీంతో రెండు జట్లూ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 20 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై 14 మ్యాచ్‌ల్లో, హైదరాబాద్‌ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ రెండోసారి తలపడుతున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు మరియు 11 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ ఓటమికి చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరానా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐదాన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..