KKR vs DC, IPL 2024: చెలరేగిన ఫిలిప్ సాల్ట్.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం.. ప్లే ఆఫ్ రేసులో ముందడుగు
Kolkata Knight Riders vs Delhi Capitals: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో సోమవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేకేఆర్ ధాటికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Kolkata Knight Riders vs Delhi Capitals: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో సోమవారం (ఏప్రిల్ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కేకేఆర్ 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేకేఆర్ ధాటికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో KKR తరపున ఫిలిప్ సాల్ట్ 33 బంతుల్లో 68 పరుగులు తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో, వెంకటేష్ అయ్యర్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సునీల్ నరైన్ 15 పరుగులు, రింకూ సింగ్ 11 పరుగులు చేశారు. . ఢిల్లీకి చెందిన అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా, లిజార్డ్ విలియమ్స్ 1 వికెట్ తీశాడు. ఈ సీజన్‌లో KKRకి ఇది ఆరో విజయం. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. అంతేకాదు ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్ దిశగా మరో ముందుడుగు వేసింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పెద్దగా స్కోరు చేయలేదు. అయితే చివరి నిమిషంలో కుల్దీప్ యాదవ్ 35 పరుగులు చేయడంతో ఢిల్లీ స్కోరు 150కి చేరుకుంది. కుల్దీప్ 35 పరుగులు, రిషబ్ 27 పరుగులు చేశారు. అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీ షా 13, జాక్ ఫ్రేజర్ మెక్‌గ్రుక్ 12 పరుగులు చేశారు. కోల్‌కతా తరఫున వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలా ఒక వికెట్ తీశారు. చూపించారు.
ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:
కోల్ కతా నైట్ రైడర్స్:
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్ ), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్లు:
అంగ్క్రిష్ రఘువంశీ, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్
ఢిల్లీ క్యాపిటల్స్:
పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
ముఖేష్ కుమార్, ప్రవీణ్ దూబే, రికీ భుయ్, సుమిత్ కుమార్, కుమార్ కుషాగ్రా
What a way to wrap up a solid all-round show 💥
A commanding performance by Kolkata Knight Riders at home 💜
And that win helps them consolidate their position in the points table 🤝
Scorecard ▶️ https://t.co/eTZRkma6UM#TATAIPL | #KKRvDC | @KKRiders pic.twitter.com/FFBYyylTKU
— IndianPremierLeague (@IPL) April 29, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..