Siddharth Roy OTT: సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
యశస్వి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపక్ సరసన తన్వి నేగి కథానాయికగా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించింది. బోల్డ్ సబ్జెక్టుతో రొమమాంటిక్ హార్డ్ హిట్టింగ్ సినిమాగా ఈ మూవీని తెరకెక్కించారు. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు దీపక్.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ అతడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో బాలనటుడిగా కనిపించిన కుర్రాడు దీపక్ సరోజ్. తెలుగులో అనేక చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన దీపక్.. ఇప్పుడు హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. దీపక్ సరోజ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ సిద్ధార్థ్ రాయ్. రోమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. యశస్వి దర్శకత్వం వహించిన ఈ మూవీలో దీపక్ సరసన తన్వి నేగి కథానాయికగా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని కలిగించింది. బోల్డ్ సబ్జెక్టుతో రొమమాంటిక్ హార్డ్ హిట్టింగ్ సినిమాగా ఈ మూవీని తెరకెక్కించారు. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు దీపక్.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మే 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. “పేరు సిద్ధార్థ్ రాయ్. ఈ క్లిష్టమైన మనిషిని చూసేందుకు రెడీ అవండి. సిద్ధార్థ్ రాయ్ మే 3న ప్రీమియర్ కానుంది” అంటూ ఆహా ట్వీట్ చేసింది. థియేటర్లలో రిలీజ్ అయిన 70 రోజుల తర్వాత సిద్ధార్థ్ రాయ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఆనంద్, నందిని, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించారు. రథన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
కథ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్) ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఇష్టమొచ్చినట్లు ఉండే కుర్రాడు. ఎలాంటి పని చేయకుండా ఇష్టానుసారంగా బతికేస్తుంటాడు. అతడి జీవితంలో ఇందు (తన్వి) రావడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ఇందు వచ్చిన తర్వాత సిద్ధార్థ్ రాయ్ జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది సినిమా.
The Name is SIDDHARTH ROY!😎
Get ready to witness a typical human being.😳 #SiddharthRoy Premieres from May 3rd, 🎬📷
@DirYeshasvi @radhanmusic @prawinpudi @Nandinireddy @BharathiAnand @srd_studios @VihaanVihinC @saregamasouth pic.twitter.com/4a8XkZ97b7
— ahavideoin (@ahavideoIN) April 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.