AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: సొంతూరులో శిల్పాశెట్టి .. మంగళూరులో పిల్లలతో కలిసి దైవ కోళాను వీక్షించిన అందాల తార.. వీడియో

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. సాహస వీరుడు సాగర కన్య, భలేవాడివి బాసూ, ఆజాద్ వంటి తెలుగు చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది శిల్ప.

Shilpa Shetty: సొంతూరులో శిల్పాశెట్టి .. మంగళూరులో పిల్లలతో కలిసి దైవ కోళాను వీక్షించిన అందాల తార.. వీడియో
Shilpa Shetty
Basha Shek
|

Updated on: Apr 29, 2024 | 8:41 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. సాహస వీరుడు సాగర కన్య, భలేవాడివి బాసూ, ఆజాద్ వంటి తెలుగు చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది శిల్ప. ఇదిలా ఉంటే ముంబైలోనే స్థిరపడిన శిల్పాశెట్టిది స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. అందుకే ఆమె తన మూలాలను ఇప్పటికీ మరచిపోలేదు. శిల్ప స్వచ్ఛమైన తుళు మాట్లాడుతుంది. మంగళూరుకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అనుసరిస్తుంది. అయితే ఇటీవల శిల్పా శెట్టి కుటుంబం చిక్కుల్లో పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమె ఇంటిని జప్తు చేశారు. ఈ నేపథ్యంలో తన సొంతూరైన మంగళూరుకు విచ్చేసింది శిల్పాశెట్టి. తన తల్లి, పిల్లలతో కలిసి దైవ కోలాను వీక్షించింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

నా పిల్లలు ఆశ్చర్యపోయారు..

‘నేను తుళునాడు అమ్మాయిని. నేను నా మూలాలకు తిరిగి వచ్చాను. నా సంస్కృతిని నా పిల్లలకు పరిచయం చేస్తున్నాను. మంగళూరులోని నాగమండలం, కొడమణిత్తయ్య దైవ కోలాలను సందర్శించాను. ఇది చూసి నా పిల్లలు ఆశ్చర్యపోయారు. “భక్తితో అనుసరించే శక్తి , విశ్వాసం నన్ను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది’ అని తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది శిల్పా శెట్టి. దైవ కోలా ఆచారం తుళునాడు సంస్కృతి, సంప్రదాయాల్లో ఒకటి. ‘కాంతారా’ సినిమా ద్వారా ఈ సంస్కృతిని అందరికీ పరిచయం చేశాడు హీరో రిషబ్ శెట్టి.

ఇవి కూడా చదవండి

దైవ కోలా వేడకల్లో శిల్పా శెట్టి కుటుంబ సభ్యులు..

ఇదిలా ఉంటే శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రూ.90 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేశారు. అందులో శిల్పాశెట్టికి చెందిన ముంబై ఇల్లు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పిల్లలతో దైవ కోలా దర్శనానికి వచ్చింది.

శిల్పా శెట్టి డ్యాన్స్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..
ఏపీకి తప్పిన తుఫాన్ గండం.. కానీ ఇంతలో మరో ట్విస్ట్
ఏపీకి తప్పిన తుఫాన్ గండం.. కానీ ఇంతలో మరో ట్విస్ట్
7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ
7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ
పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు