AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: గుర్తుపట్టారా? ఈ తెలుగు లేడీ కమెడియన్‌ని.. ఎంత స్టైలిష్‌గా మారిపోయారో! లేటెస్ట్ ఫొటోస్ వైరల్

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆమెను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. పేరుకు తమిళ నటే అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేశారామె. ఉత్తమ లేడీ కమెడియన్ గా సుమారు రెండు దశాబ్దాల పాటు సినిమా రంగానికి సేవలందించారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు.

Actress: గుర్తుపట్టారా? ఈ తెలుగు లేడీ కమెడియన్‌ని.. ఎంత స్టైలిష్‌గా మారిపోయారో! లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 29, 2024 | 9:10 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆమెను ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. పేరుకు తమిళ నటే అయినా తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేశారామె. ఉత్తమ లేడీ కమెడియన్ గా సుమారు రెండు దశాబ్దాల పాటు సినిమా రంగానికి సేవలందించారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా కామెడీ లెజెండ్ బ్రహ్మానందంతో ఆమె చేసిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. వీరిద్దూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారంటే పెదాలపై నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ఈ పాటికే చాలా మందికి అర్ధమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆమె మరెవరో కాదు తెలుగు పాపులర్ కమెడియన్ కోవై సరళ. గతంలో మాదిరిగా ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదామె. చివరిగా 2022లో సెంబీ అనే సినిమాలో కోవై సరళ నటించారు. అందులో ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. మళ్లీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక సినిమాతో మన ముందుకు రానున్నారామె.

సరికొత్త లుక్ లో..

తమిళంలో హర్రర్ థ్రిల్లర్ సినిమాల కు సంబంధించి అరణ్మనై సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగులోనూ ఈ సినిమాలు రిలీజై ఇక్కడి ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. ఇప్పుడీ సిరీస్ లో నాలుగో భాగం రానుంది. అరణ్మనై పార్ట్ 4 లో మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ హార్రర్ మూవీ బాక్ పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈమూవీ మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవై సరళ కూడా హాజరయ్యారు. స్టైలిష్ గా సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారామె. చాలామంది మొదల ఆమెను చూసి గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత కోవై సరళ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

బాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోవై సరళ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్