Shobha Shetty: కొత్తింట్లోకి శోభాశెట్టి.. గ్రాండ్‌గా గృహ ప్రవేశం..సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. వీడియో
బుల్లితెర ప్రేక్షకులకు శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడనాటకు చెందిన ఈ ముద్దుగుమ్మ కార్తీక దీపం సీరియంల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె పోషించిన లేడీ విలన్ మోనిత పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో సందడి చేసింది.
బుల్లితెర ప్రేక్షకులకు శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కన్నడనాటకు చెందిన ఈ ముద్దుగుమ్మ కార్తీక దీపం సీరియంల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె పోషించిన లేడీ విలన్ మోనిత పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో సందడి చేసింది. అమర్ దీప్, ప్రియాంకలతో కలిసి స్పా బ్యాచ్ గా ఏర్పడి స్పై (శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ కు చుక్కలు చూపెట్టింది. తనదైన ఆటతీరు, మాట తీరుతో గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లింది కానీ విజేతగా నిలవలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఆ మధ్యన ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ఒక శుభ వార్త చెప్పింది శోభా శెట్టి. కొత్తింట్లోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కు తెలియజేసింది. బిగ్ బాస్ షోతో వచ్చిన డబ్బులతో ఇల్లు కొనుకున్నట్లు ఆ మధ్యన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఎట్టకేలకు తన సొంతింటి కలను సాకారం చేసుకుంది శోభ. సోమవారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గృహ ప్రవేశం జరిగింది.
బిగ్ బాస్ డబ్బులతోనే..
శోభ గృహ ప్రవేశం కార్యక్రమానికి పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్, టేస్టీ తేజా తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
View this post on Instagram
సీరియల్స్ కు దూరంగా శోభా శెట్టి..
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ కు దూరమైంది శోభా శెట్టి. ఎక్కువగా తన యూట్యూబ్ ఛానెల్ పై బాగా ఫోకస్ చేసింది. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శోభాశెట్టి తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా షేర్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.