AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: హార్దిక్, తెలుగబ్బాయిల మధ్య గొడవ.. రోహిత్ రాకతో.. ముంబై టీమ్ లో మళ్లీ బయట పడ్డ విభేదాలు

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్‌కు గడ్డు రోజులు వస్తున్నాయి. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. గత 10 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఏడో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి.

IPL 2024: హార్దిక్, తెలుగబ్బాయిల మధ్య గొడవ.. రోహిత్ రాకతో.. ముంబై టీమ్ లో మళ్లీ బయట పడ్డ విభేదాలు
ఇక రోహిత్ శర్మకు ఫ్రాంచైజీకి మధ్య బంధం సరిగ్గా లేకపోవడంతో.. ఈసారి రోహిత్ శర్మ వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. అటు రోహిత్ శర్మ స్థానంలో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను రిటైన్ చేసుకోనుంది ముంబై.
Basha Shek
|

Updated on: May 02, 2024 | 10:03 PM

Share

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్‌కు గడ్డు రోజులు వస్తున్నాయి. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై ఇండియన్స్ ఘోరంగా ఓడిపోయింది. గత 10 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఏడో ఓటమి. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ముంబై ఇండియన్స్ ఆటతీరు సంగతి పక్కన పెడితే.. ఆప్పుడు ఆ జట్టులో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. తాజాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తెలుగబ్బాయి తిలక్ వర్మ మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు వివాదాల్లో చిక్కుకుంది. ఆటతీరు కంటే నాయకత్వ మార్పు చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. దీంతో ముంబై జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందని రూమర్లు వచ్చాయి. ఇప్పుడీ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయని సమాచారం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆ జట్టు యువ బ్యాటర్ తిలక్ వర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ‘హిట్‌మేనియా 45’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దీనికి సంబంధించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఘర్షణ పడ్డారు. తిలక్ ఆటతీరుపై హార్దిక్ పాండ్యా బహిరంగంగా విమర్శలు కురిపించడమే ఈ గొడవకు కారణమని తెలుస్తోంది. ఈ వివాదం ఎంత తారాస్థాయికి చేరిందంటే, జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా కొందరు ఆటగాళ్లు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత గొడవ సద్దుమణిగిందని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఢిల్లీపై ఓటమి తర్వాత, హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో తిలక్ పేరు చెప్పకుండా పరోక్షంగా అతని ఆటతీరును తప్పుపట్టాడు హార్దిక్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌పై తిలక్ దూకుడుగా ఆడకపోవడమే తమ జట్టు ఓటమికి కారణమని హార్దిక్ అభిప్రాయపడ్డాడు.

ఈ విషయంలో కోపంగా ఉన్న తిలక్.. డ్రెస్సింగ్ రూమ్​లో హార్దిక్​ ఆ ప్రస్తావన తీసుకురాగానే సీరియస్ అయ్యాడని, అలా గొడవ పెరిగి పెద్దదైందని వినిపిస్తోంది. రోహిత్ రాకపోతే ఈ ఫైట్ ఇంకా తీవ్ర స్థాయికి చేరుకునేదని అంటున్నారు. ఈ గొడవతో ముంబైలో చీలికలు ఉన్నాయనే విషయం మరోసారి బయటపడ్డాయని చెబుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత? అబద్ధమెంతో తెలియాలంటే ఆ జట్టు ఆటగాళ్లు లేదా ప్రాంఛైజీ వారే మాట్లాడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..