- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Team India Batters Flop IPL Show After T20 World Cup 2024 Squad Announcement
IPL 2024: ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా? ఐపీఎల్‌లో టీమిండియా ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. జట్టును ప్రకటించిన వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు స్టార్ ప్లేయర్లకు అవకాశాలు రాకపోవడంపై అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచకప్ లో ప్లేస్ ఫిక్స్ అయ్యిన వెంటనే కొందరు స్టార్ ఆటగాళ్లు రిలాక్స్ అయినట్లు కనిపించింది.
Updated on: May 02, 2024 | 10:36 PM

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. జట్టును ప్రకటించిన వెంటనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు స్టార్ ప్లేయర్లకు అవకాశాలు రాకపోవడంపై అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచకప్ లో ప్లేస్ ఫిక్స్ అయ్యిన వెంటనే కొందరు స్టార్ ఆటగాళ్లు రిలాక్స్ అయినట్లు కనిపించింది.

హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టును ప్రకటించిన తర్వాత, లక్నో సూపర్‌జెయింట్‌తో మ్యాచ్ ఆడిన పాండ్యా ఖాతా కూడా తెరవలేకపోయాడు. అయితే బౌలింగ్‌లో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

శివమ్ దూబే: మెరుపు బ్యాటింగ్‌కు పేరుగాంచిన శివమ్ దూబే టీమ్ ఇండియాకు ఎంపికైన తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో దూబే సున్నాకి అవుటయ్యాడు.

రోహిత్ శర్మ: ఈ ఐపీఎల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు. లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. ప్రస్తుతం రోహిత్ ఫామ్ కూడా టీమిండియా టెన్షన్‌ని పెంచింది.

రవీంద్ర జడేజా: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. కానీ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా కేవలం 2 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను ముగించాడు

సూర్యకుమార్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఐపీఎల్‌లో పేలవమైన ఫామ్‌తో బాధపడ్డాడు. సూర్య ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 176 పరుగులు చేశాడు. ఇప్పుడు T20 ప్రపంచ కప్‌కు ఎంపికైన తర్వాత కూడా, సూర్య లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక అర్షదీప్ సింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్‌పై 13 ఎకానమీతో తన 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. అలాగే ఒక్క వికెట్ మాత్రమే తీశాడు