- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma talks about playing under Captain Hardik Pandya and his past experiences playing under different Captains
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన రోహిత్.. ముంబైలో తన పాత్రపై ఏమన్నాడంటే?
Rohit Sharma vs Hardik Pandya: రోహిత్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్ తీసుకోకుండా హార్దిక్ కెప్టెన్‌గా చేయడంతో చాలా మందిని కలవరపెట్టింది. ఈ క్రమంలో రోహిత్‌ని బౌండరీ లైన్‌లోకి పంపిన వీడియో కూడా వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడం ఎలా ఉందో రోహిత్ శర్మ వివరించాడు. ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడడం నాకు కొత్త కాదు అంటూ చెప్పుకొచ్చాడు.
Updated on: May 16, 2024 | 3:15 PM

ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. రోహిత్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్ తీసుకోకుండా హార్దిక్ కెప్టెన్‌గా చేయడంతో చాలా మందిని కలవరపెట్టింది. ఈ క్రమంలో రోహిత్‌ని బౌండరీ లైన్‌లోకి పంపిన వీడియో కూడా వైరల్‌గా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడం ఎలా ఉందో రోహిత్ శర్మ వివరించాడు. ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడడం నాకు కొత్త కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడిన అనుభవం ఎలా ఉందని రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ సమాధానమిస్తూ.. 'ఇది జీవితంలో భాగం. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. ఇది మంచి అనుభవం' అంటూ రోహిత్ శర్మ అన్నాడు. హార్దిక్‌పై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

‘‘ఇంతకు ముందు నేను కెప్టెన్‌ని కాదు. చాలా మంది కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడాను. ఇది భిన్నమైనది కాదు లేదా కొత్తది కాదు' అంటూ రోహిత్ తెలిపాడు. రోహిత్ ఇంతకుముందు ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియాలో ఆడాడు. అలాగే, IPLలో ఆడమ్ గిల్‌క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆడాడు.

"ఒక ఆటగాడిగా మనకు ఏది అవసరమో అది ప్రయత్నించి చేయడం. గత నెల రోజులుగా ఆ ప్రయత్నం చేస్తున్నాను' అంటూ రోహిత్ శర్మ తెలిపాడు.

రోహిత్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా తొలగించాడని పలువురు ఆరోపిస్తున్నారు. మైదానంలో హార్దిక్ పాండ్యాతో అభిమానులు సమస్యను లేవనెత్తడంతో రోహిత్ శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. రోహిత్‌ను పదే పదే మైదానంలో అవమానిస్తున్నాడని పలువురు అంటున్నారు.




