AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh Raina: సురేష్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం.. 29 ఏళ్లకే..

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా ఇంట వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు నాలుగేళ్ల క్రితం 2020 ఐపీఎల్ సీజన్ జరుగుతుంగా.. కొందరు దుండుగులు రైనా మేనమామ ఇంట్లోకి దూరి వారందరినీ అతి కిరాతకంగా చంపేశారు. దీంతో రైనా వెంటనే ఐపీఎల్ ను వీడి స్వదేశానికి చేరుకున్నాడు. తాజాగా రైనా ఇంట మరో విషాదం చోటు చేసుకుంది

Suresh Raina: సురేష్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం.. 29 ఏళ్లకే..
Suresh Raina
Basha Shek
|

Updated on: May 02, 2024 | 6:52 PM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా ఇంట వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు నాలుగేళ్ల క్రితం 2020 ఐపీఎల్ సీజన్ జరుగుతుంగా.. కొందరు దుండుగులు రైనా మేనమామ ఇంట్లోకి దూరి వారందరినీ అతి కిరాతకంగా చంపేశారు. దీంతో రైనా వెంటనే ఐపీఎల్ ను వీడి స్వదేశానికి చేరుకున్నాడు. తాజాగా రైనా ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. తన మరో మేనమామ కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా పఠాన్‌కోట్‌-మండియా జాతీయ రహదారిపై రైనా కజిన్‌ (మేన మామ కొడుకు) సౌరభ్‌ కుమార్‌ (29) స్కూటర్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్యాక్సీ ఇతని వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌరభ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో సౌరభ్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి కూడా ఘటనా స్థంలోనే చనిపోయాడు. సౌరభ్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు శుభమ్‌ (19) అని సమాచారం.

సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రైవర్‌ పేరు షేర్‌ సింగ్‌ అని , ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. స్థానిక ఎస్పీ కంగ్రా శాలినీ అగ్రిహోత్రి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ‘గగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది హిట్ అండ్ రన్ కేసుగా ప్రాథమిక సమాచారం వచ్చింది. అక్కడ ఇద్దరు యువకులు చనిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న టాక్సీ డ్రైవర్‌ను వెంబడించి మండి నుంచి అదుపులోకి తీసుకున్నారు.  మంగళవారం (ఏప్రిల్ 30) రాత్రి 11.30 గంటల సమయంలో గగ్గల్‌లోని హిమాచల్ టింబర్ సమీపంలో గుర్తుతెలియని వాహనం డ్రైవర్ స్కూటర్ నంబర్ హెచ్‌పి-40ఈ-8564ను అతి వేగంతో ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో స్కూటీ డ్రైవర్ గాగల్ నివాసి సౌరభ్ కుమార్, శుభం నివాసి కుత్మాన్ మృతి చెందారు. సౌరభ్ సురేష్ రైనా బంధువు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు డ్రైవర్‌ను విచారించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఆధారంగా డ్రైవర్‌ని వెంబడించారు. ఆ తర్వాత అతన్ని మండి నుంచి అదుపులోకి తీసుకుని తిరిగి కాంగ్రాకు తీసుకొచ్చారు. ఇప్పుడు నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు’ అని ఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.