MI vs KKR, IPL 2024: చెలరేగిన స్టార్క్.. కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు.. ప్లే ఆఫ్ అవకాశలు గల్లంతు
Mumbai Indians vs Kolkata Knight Riders: ఐపీఎల్-2024లో ముంబయి ఇండియన్స్ పోరాటం ఇక ముగిసినట్లే. శుక్రవారం (మే 03) రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి కోల్ కతా బౌలర్ల ధాటికి
Mumbai Indians vs Kolkata Knight Riders: ఐపీఎల్-2024లో ముంబయి ఇండియన్స్ పోరాటం ఇక ముగిసినట్లే. శుక్రవారం (మే 03) రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి కోల్ కతా బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో కేవలం 145 పరుగులకు కుప్పకూలింది. మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (56; 35 బంతుల్లో) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయాడు. దీనికి తోడు మిగతా బ్యాటర్లంతా తేలిపోయారు. ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ(11), నమన్ ధీర్ (11), తిలక్ వర్మ (4), నేహాల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1), టిమ్ డేవిడ్ (24) ఇలా స్టార్ బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ముంబైకు మరో ఓటమి తప్పలేదు.. కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, వరుణ్ 2, నరైన్ 2, రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. వెంకటేశ్ అయ్యర్ (70) టాప్ స్కోరర్ గా నిలవగా మనీష్ పాండే (42) ఓ మోస్తరుగా రాణించాడు . నువాన్ తుషారా 3, జస్ ప్రీత్ బుమ్రా 3, హార్దిక్ 2, పీయూష్ ఒక వికెట్ తీశారు. కాగా ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. మరోవైపు ప్లే ఆఫ్ రేసు అవకాశాలను కోల్ కతా మరింత పదిలం చేసుకుంది.
స్టార్క్ విజృంభణ..
A memorable win for @KKRiders 🥳
They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪
Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj
— IndianPremierLeague (@IPL) May 3, 2024
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార
ఇంపాక్ట్ ప్లేయర్లు:
రోహిత్ శర్మ, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్లు:
అనుకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, చేతన్ సకారియా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..