- Telugu News Photo Gallery Cinema photos Did You Know Age Gap Between Anushka Sharma And Her Husband Virat Kohli
Virat Kohli- Anushka: విరాట్ కోహ్లీ కంటే అనుష్కా శర్మ పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లది ప్రేమ వివాహం. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2017లో ఇటలీవేదికగా పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమ, పెళ్లి, కుటుంబ వ్యవహారాల గురించి చాలామందికి తెలుసు. అయితే కోహ్లీ, అనుష్కల ఏజ్ గ్యాప్ మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
Updated on: May 03, 2024 | 10:05 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లది ప్రేమ వివాహం. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2017లో ఇటలీవేదికగా పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమ, పెళ్లి, కుటుంబ వ్యవహారాల గురించి చాలామందికి తెలుసు. అయితే కోహ్లీ, అనుష్కల ఏజ్ గ్యాప్ మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇటీవల 36వ వసంతంలోకి అడుగుపెట్టింది అనుష్క శర్మ. కోహ్లీ, ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది

అయితే అనుష్క విరాట్ కంటే 188 రోజులు అంటే 6 నెలల 4 రోజులు పెద్దది. అనుష్క శర్మ 1 మే 1988న జన్మించింది. అదే సమయంలో విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. విరాట్ కోహ్లీకి ఇప్పుడు 35 ఏళ్లు

నివేదికల ప్రకారం, అనుష్క శర్మ. భర్త విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ 1300 కోట్లు. ఇందులో విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ 1050 కాగా, అనుష్క సంపద 255 కోట్లు.

విరాట్, అనుష్క దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వాళ్ల కూతురు పేరు వామిక, కొడుకు పేరు అకాయ్. ఈ ఏడాది లోనే అనుష్క- కోహ్లీ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు.