T20 World Cup 2024: శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో ‘టీమిండియా’ విలన్

ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వెస్టిండీస్‌, అమెరికాలు ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. మే 1 నాటికి టీ20 ప్రపంచకప్‌కు ప్రధాన జట్లు తమ జట్లను ప్రకటించాయి

T20 World Cup 2024:  శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో 'టీమిండియా' విలన్
Richard Kettleborough
Follow us
Basha Shek

|

Updated on: May 03, 2024 | 7:41 PM

ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వెస్టిండీస్‌, అమెరికాలు ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. మే 1 నాటికి టీ20 ప్రపంచకప్‌కు ప్రధాన జట్లు తమ జట్లను ప్రకటించాయి. దీని తర్వాత ఐసీసీ మరో కీలక ప్రకటన చేసింది. ఐసీసీ ఈ ప్రకటనతో టీమ్ ఇండియాకు టెన్షన్ పట్టుకుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. T20 ప్రపంచ కప్ 2024 కోసం అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను ICC ప్రకటించింది. ఐసీసీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచకప్ కోసం 20 మంది అంపైర్లు, 6 మంది మ్యాచ్ రిఫరీల పేర్లను ఐసీసీ ప్రకటించింది. భారత్ నుంచి ఇద్దరు అంపైర్లను ఐసీసీ నియమించింది. నితిన్ మీనన్, జయరామన్ మదన్‌ గోపాల్ అంపైరింగ్ చేయనున్నారు. మ్యాచ్ అఫీషియల్‌గా జావగల్ శ్రీనాథ్‌ని చేర్చారు. ఈ అంపైర్లు, మ్యాచ్ అధికారులపై భారీ బాధ్యత ఉంటుంది.

అలాగే ఐసీసీ ప్రకటించిన అంపైర్ల జాబితాలో ఒకరి పేరు ఉండడంతో టీమిండియా టెన్షన్‌ పెరిగింది. టీమ్ ఇండియాకు విలన్ లా దాపరిస్తోన్న రిచర్డ్ కెటిల్‌బరోను కూడా అంపైర్‌గా చేర్చారు. దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రిచర్డ్ కెటిల్‌బరో ICC టోర్నమెంట్‌లోని వివిధ 6 నాకౌట్ టోర్నమెంట్‌లలో టీమ్ ఇండియాకు అంపైర్‌గా ఉన్నారు. ఈ ఆరు మ్యాచ్‌ల్లో ఆరింటిలో టీమిండియా ఓడిపోయింది. టీమ్ ఇండియా ఓటమికి రిచర్డ్ కెటిల్ బరో బాధ్యత వహించలేదు. అయితే కెటిల్‌బరో అంపైర్‌గా ఉంటే టీమిండియా ఓడిపోతుందన్న భావన టీమిండియా అభిమానుల్లో బాగా నాటుకుపోయింది. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌లో కెటిల్‌బరో మళ్లీ అంపైర్‌గా ఎంపికయ్యాడు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ‘మళ్లీ శని దాపరించాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రపంచకప్ అంపైర్లు:

క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గాఫ్నీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అల్లావుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్‌బరో, జయరామన్ మదన్ గోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రీఫెల్, పాల్ రీఫెల్ , లైంగ్ రోడ్స్, లాంగ్టన్ రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకోబ్.

ఇవి కూడా చదవండి

రిఫరీలు:

డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, జవగల్ శ్రీనాథ్.

టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..