LSG vs KKR, IPL 2024: నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
Lucknow Super Giants vs Kolkata Knight Riders: కోల్ కతా బ్యాటర్లు మళ్లీ చెలరేగారు. లక్నో బౌలర్లను చిత్తు చేస్తూ భారీ స్కోరు సాధించారు. మరీ ముఖ్యంగా సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరిలో శ్రేయస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడడంతో ఆ జట్టు
Lucknow Super Giants vs Kolkata Knight Riders: కోల్ కతా బ్యాటర్లు మళ్లీ చెలరేగారు. లక్నో బౌలర్లను చిత్తు చేస్తూ భారీ స్కోరు సాధించారు. మరీ ముఖ్యంగా సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరిలో శ్రేయస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడడంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకు ముందు ఫిలిప్ సాల్ట్ (32), రఘువంశీ (32) దూకుడుగా ఆడారు. అయితే ఆండ్రీ రస్సెల్ (12), రింకూ సింగ్ (16) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. లక్నో బౌలర్లలో నవీనుల్ 3 వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, యుధ్వీర్, ఠాకూర్ తలో వికెట్ తీశారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం. మరి కేకేఆర్ విధించిన భారీ లక్ష్యాన్ని లక్నో ఛేదిస్తుందో లేదో చూడాలి.
SAILING AWAY ⛵️
Sunil Narine’s fabulous run continues with another stroke full FIFTY 💥
He also crosses the 4️⃣0️⃣0️⃣- run mark for the first time in #TATAIPL 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#LSGvKKR | @KKRiders pic.twitter.com/Iw1aeFz9nQ
— IndianPremierLeague (@IPL) May 5, 2024
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
అంకుల్ రాయ్, మనీష్ పాండే, శ్రీకర్ భరత్, షెర్ఫనే రూథర్‌ఫోర్డ్, వైభవ్ అరోరా
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):
KL రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, దేవదత్ పడిక్కల్
రమణ్ దీప్ సింగ్ మెరుపులు..
𝗞𝗔𝗕𝗢𝗢𝗠 💥
Ramandeep Singh adding merry to #KKR‘s total 👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvKKR | @KKRiders pic.twitter.com/U3nxM2vuOx
— IndianPremierLeague (@IPL) May 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..