PBKS vs CSK, IPL 2024: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో జంప్
Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. నామమాత్రపు స్కోరైనా లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు.
Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. నామమాత్రపు స్కోరైనా లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో రెండో ఓవర్‌లో జానీ బెయిర్ స్టో (7) అవుటయ్యాడు. ఆ తర్వాత రిలే రోస్పో కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ప్రభాసిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్ పంజాబ్ ను ఆదుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ శశాంక్ సింగ్ వికెట్ తో పంజాబ్ పతనం మళ్లీ మొదలైంది. జితేష్ శర్మ కూడా ఖాతా తెరవలేకపోయాడు. అతను టెన్త్‌కు తిరిగి రాలేడు. సామ్ కరణ్ 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో అశుతోష్ శర్మ 3 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో విజయం చెన్నై సూపర్ కింగ్స్ వైపు మొగ్గింది.
బ్యాటింగ్ లో అదరగొట్టిన రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్ లో స్థానం ఖాయం.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
పంజాబ్ కింగ్స్ (PBKS): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్(సి), జితేష్ శర్మ(w), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, తనయ్ త్యాగరాజన్, విధ్వత్ కవేరప్ప, రిషి ధావన్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (సి), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (w), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:
సమీర్ రిజ్వీ, సిమర్జీత్ సింగ్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, ప్రశాంత్ సోలంకి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..