IPL 2024: ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చాడో తెలుసా?

శనివారం జరిగిన ఐపీఎల్2024 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై RCB అద్భుత విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 147 పరుగులు మాత్రమే చేసింది.

IPL 2024: ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చాడో తెలుసా?
Virat Kohli
Follow us

|

Updated on: May 05, 2024 | 7:55 PM

శనివారం జరిగిన ఐపీఎల్2024 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై RCB అద్భుత విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 147 పరుగులు మాత్రమే చేసింది. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టుకు ఫాఫ్ డుప్లెసిస్ (64), విరాట్ కోహ్లీ (42) శుభారంభం అందించారు. అయితే హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కోహ్లీని కట్టడి చేసి, ఔట్ చేయడంలో ఆఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ సక్సెస్ అయ్యాడు. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ 4వ బంతిని కవర్స్ దిశగా షాట్ కొట్టేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ తగిలి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కింగ్ కోహ్లి వికెట్ పడగానే.. నూర్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఎందుకంటే నూర్ అహ్మద్‌కి ఇష్టమైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. తొలిసారి తన ఫేవరెట్ క్రికెటర్ వికెట్ దక్కడంతో నూర్ ఆనందానికి అవధుల్లేవు. నూర్ ఆనందాన్ని విరాట్ కోహ్లీ కూడా గ్రహించాడు.

అందుకే మ్యాచ్ ముగిసిన అనంతరం కింగ్ కోహ్లీ తన జెర్సీని నూర్ అహ్మద్‌కు బహుమతిగా ఇచ్చాడు. ‘గ్రేట్ బౌలింగ్, గుడ్ లక్’ అంటూ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన తన జెర్సీని ఆఫ్ఘన్ స్పిన్నర్‌కు కోహ్లీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఎల్లప్పుడూ నా ఫేవరెట్‌లలో ఒకరు అని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు నూర్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కింగ్ కోహ్లీ గొప్పదనానికి ఇదొక నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న టి మ్యాచ్ లో విజయంలో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..