Love Guru OTT: విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

బిచ్చగాడు ఫేమ్ విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం రోమియో. తెలుగులో లవ్ గురు పేరుతో విడుదలైంది. గద్దల కొండ గణేశ్ మూవీ ఫేమ్ మృణాళిని రవి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన లవ్ గురు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

Love Guru OTT: విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Love Guru Movie
Follow us
Basha Shek

|

Updated on: May 05, 2024 | 9:15 PM

బిచ్చగాడు ఫేమ్ విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం రోమియో. తెలుగులో లవ్ గురు పేరుతో విడుదలైంది. గద్దల కొండ గణేశ్ మూవీ ఫేమ్ మృణాళిని రవి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకువచ్చిన లవ్ గురు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ పాత్రలు పోషించిన విజయ్ ఆంటోని ఇందులో మొదటిసారిగా రొమాంటిక్ లవర్ గా నటించడం విశేషం. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన లవ్ గురు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తమిళ్ లో మే 10 తేదీ నుంచి రోమియో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు వెర్షన్ లవ్ గురు ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మే10 నే తెలుగులోనూ లవ్ గురు స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే తెలుగులో లవ్ గురు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ దగ్గర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి లవ్ గురు సినిమా ఆహాలో వస్తుందా లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుందా? లేదా రెండింటిలోనూ స్ట్రీమింగ్ కు వస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

నాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించిన లవ్ గురు సినిమాలో యోగి బాబు, వీటీవీ గణేశ్, ఇళవరసు, సుధ, తలైవాసల్ విజయ్, శ్రీజ రవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ ఆంటోని సతీమణి మీరా ఆంటోని ఈ సినిమాను నిర్మించడం విశేషం. అలాగే భరత్ ధన శేఖర్ అందించిన స్వరాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక లవ్ గురు సినిమా కథ విషయానికి వస్తే.. మలేషియాలో స్థిరపడిన అరవింద్ (విజయ్ ఆంటోనీ) తిరిగి తన సొంతూరుకు వస్తాడు. అక్కడ లీల (మృణాళిని రవి) ను చూసి ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే ఈ వివాహం లీలకు ఏ మాత్రం ఇష్టం లేదని అరవింద్ కు వెంటనే అర్ధమవుతుంది. అయితే ప్రేమించిన లీల మనసును ఎలాగైనా గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు? మరి లీల మనసును అరవింద్ గెలిచాడా?లేదా?అన్నది తెలుసుకోవాలంటే లవ్ గురు సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.