AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైటానిక్‌ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి.. గాంధీ సినిమాతో భారత్ తో ప్రత్యేక అనుబంధం

బెర్నార్డ్ నటుడుగా అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో భాగమయ్యాడు. ఆయన మృతి పట్ల అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు - అందరూ అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్‌లో పోషించిన పాత్రను సూచిస్తున్నారు.. అయితే అతను వోల్ఫ్ హాల్ సిరీస్‌లో కూడా చాలా బాగా నటించాడు. మరొక వ్యక్తి రాశాడు- గుడ్‌బై బెర్నార్డ్ హిల్. మీ అద్భుతమైన నటనతో మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు.

టైటానిక్‌ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి.. గాంధీ సినిమాతో భారత్ తో ప్రత్యేక అనుబంధం
Bernard Hill Dies At 79
Surya Kala
|

Updated on: May 06, 2024 | 8:34 AM

Share

కొన్ని సినిమాలు హద్దులు దాటి దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సొంతం చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడతాయి. అంతేకాదు డబ్బు సంపాదించిన ఆ సినిమాల్లోని పాత్రలు అందులో నటించిన నటీనీతులు కూడా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతారు. అలాంటి సినిమాల్లో ఒకటి టైటానిక్. హాలీవుడ్ సినిమా టైటానిక్ పేరు వినని వారు ఎవరుంటారు? ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ గా లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ తుది శ్వాస విడిచారు. బెర్నార్డ్ ఈ చిత్రంలో కెప్టెన్ ఎడ్వర్డ్ జాన్ స్మిత్ పాత్రను పోషించారు. ఈ పాత్రతో అతనికి పాపులారిటీ వచ్చింది. నటుడిగా బెర్నార్డ్ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

బెర్నార్డ్ మరణ వార్తను స్కాటిష్ జానపద సంగీత విద్వాంసుడు బార్బరా డిక్సన్ వెల్లడించారు. అతను X లో  బెర్నార్డ్ మృతి గురించి ప్రస్తావిస్తూ బెర్నార్డ్ హిల్ ఈ ప్రపంచంలో ఇక లేరని చెప్పడానికి తనకు చాలా బాధగా ఉంది. మేము జాన్ పాల్ జార్జ్ రింగో, విల్లీ రస్సెల్ షోలలో కలిసి పనిచేశాము. బెర్నార్డ్ తెలివైన నటుడు. బెర్నార్డ్ తో కలిసి పనిచేయడం తనకు ఓ అద్భుతం అని రెస్ట్ ఇన్ పీస్ బెన్నీ (బెర్నార్డ్ హిల్) అని కామెంట్ ను జత చేశాడు.

విచారం వ్యక్తం చేసిన అభిమానులు

బెర్నార్డ్ నటుడుగా అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో భాగమయ్యాడు. ఆయన మృతి పట్ల అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – అందరూ అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్‌లో పోషించిన పాత్రను సూచిస్తున్నారు.. అయితే అతను వోల్ఫ్ హాల్ సిరీస్‌లో కూడా చాలా బాగా నటించాడు. మరొక వ్యక్తి రాశాడు- గుడ్‌బై బెర్నార్డ్ హిల్. మీ అద్భుతమైన నటనతో మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. కళ పట్ల ప్రజలను ప్రేరేపించిన విధానం, మీ  ప్రాముఖ్యతను కాదనలేమని నివాళుల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏయే ప్రాజెక్టుల్లో పనిచేశారంటే

బెర్నార్డ్ హిల్ తన కెరీర్‌లో చాలా సినిమాలు , సిరీస్‌లలో పనిచేశాడు. నటుడు 1976లో ట్రయల్ బై కాంబాట్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. దీని తరువాత గాంధీ, ది బౌంటీ, ది చైన్, మౌంటైన్స్ ఆఫ్ ది మూన్, టైటానిక్, ది స్కార్పియన్ కింగ్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ , నార్త్ vs సౌత్ వంటి చిత్రాలలో పనిచేశాడు. అతను బాయ్స్ ఫ్రమ్ ది బ్లాక్ స్టఫ్, సన్‌రైజ్, వోల్ఫ్ హాల్ వంటి సిరీస్‌లో నటించి తన నటనతో ప్రసిద్ది చెందాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..