- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde New Trending Photo viral in social media on 06 May 2024 Telugu Actress Photos
Pooja Hegde: వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా హెగ్డే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తెలుగులోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. 2014లో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. గతంలో టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోయింది పూజాహెగ్డే. అరవింద సమేత, అల వైకుఠపురం, మహర్షి సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
Updated on: May 06, 2024 | 7:54 PM

అంతగా మ్యూజిక్‌ని ఇష్టపడతానంటున్నారు మేడమ్ పూజా. ప్రస్తుతం తమిళ్‌లో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే. నార్త్ లోనూ కొన్ని సినిమాలున్నాయి. త్వరలోనే నాగచైతన్యతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు.

గతంలో టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోయింది పూజాహెగ్డే. అరవింద సమేత, అల వైకుఠపురం, మహర్షి సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆకట్టుకోవడం విఫలమయ్యాయి.

ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు టాక్. దీంతో కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అంతేకాకుండా అప్పటికే ఒప్పుకున్న తెలుగు సినిమాల నుంచి కూడా తప్పుకుంది పూజా హెగ్డే.

అయితే అటు హిందీలోనూ ఆఫర్స్ రాకపోవడంతో సైలెంట్ అయ్యింది పూజా. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ యాక్టివ్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి చైతూ సరసన కనిపించనుందని టాక్.

రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు మూవీకి పూజా ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే సియాసత్ నివేదిక ప్రకారం పూజా హెగ్డే ఇప్పుడు రెమ్యునరేషన్ భారీగా పెంచిందని సమాచారం. ఈ సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుంటదట.

సినిమాల్లో వేగం తగ్గించినా తన డ్రస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటుంది. అందుకే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా పూజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.




