AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha Telugu Indian Idol: సింగర్ అవ్వాలనుకుంటున్నారా? USAలోనూ ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. వివరాలివే

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ త్వరలోనే మెప్పించటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆడిషన్స్‌కు సంబంధించిన తేదీలు

Aha Telugu Indian Idol: సింగర్ అవ్వాలనుకుంటున్నారా? USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. వివరాలివే
Aha Telugu Indian Idol 3
Basha Shek
|

Updated on: May 05, 2024 | 4:53 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ త్వరలోనే మెప్పించటానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆడిషన్స్‌కు సంబంధించిన తేదీలు వెల్లడి కావటంతో ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకునే వారితో పాటు సంగీత స్వర సాగరంలో మునిగిపోవటానికి ఉవ్విల్లూరే అందరిలోనూ ఉత్సాహం నెలకొంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ మొదటిసారి USAలో ప్రారంభం కానుండటం విశేషం. మే 4న న్యూజెర్సీలో TV9 USA స్టూడియోస్,399 హూస్ లేన్ 2nd ఫ్లోర్ పిస్కాటవే.. అలాగే మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్,లూయిస్ విల్లే #5లలో ఆడిషన్స్ జరగనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు సంగీత ప్రేమికులు, ప్రేక్షకుల నుంచే కాకుండా ఔత్సాహిక గాయకుల నుంచి చాలా గొప్ప స్పందన వచ్చింది.టెలివిజన్ రంగంలో ఈ కార్యక్రమం సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దీంతో మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. దీన్ని అందుకునేలా ఉంటుందని వాగ్దానం చేస్తోంది ఆహా. అందుకు కారణం ఏకంగా పదివేల మంది ఔత్సాహిక గాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

సూపర్ రెస్పాన్స్..

సంగీత దిగ్గజాలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి నేతృత్వంలో గొప్ప న్యాయ నిర్ణేతల బృందం దీనికి మార్గనిర్దేశకం చేస్తోంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 వచ్చిన స్పందన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అసాధారణ సంగీత ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి అమూల్యమైన మార్గదర్శకత్వం, నిర్మాణాత్మకమైన సద్విమర్శలు, అలాగే పోటీదారులను ఆరోగ్యకరమైన వాతావరణంతో ప్రోత్సహించడం అనేది ఔత్సాహిక గాయకులను గొప్పగా తీర్చిదిద్దడంలో, గొప్ప నైపుణ్యాలను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించాయి.

తొలిసారిగా అమెరికాలో..

ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 అదే ఉత్సాహంతో సరికొత్త ప్రయాణాన్ని ఉల్లాసకరంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షకులకు అసాధారణమైన ప్రతిభను వేదిక ప్రదర్శించటమే కాకుండా, సంగీతాభిమానులకు సమానమైన వినోదాన్ని అందించటంలో ఆహా తిరుగులేని నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. మన హైదరాబాద్‌లో మెగా ఆడిషన్‌లు మే 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఔత్సాహిక గాయకులు తమ గాత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి గౌరవనీయమైన టైటిల్ కోసం పోటీ చేయటాని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది ఆహా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.