Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. సుమారు పదేళ్ల తర్వాత సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీపై మొదట మంచి హైప్ ఏర్పడింది. శ్మశానంలో టీజర్ లాంఛ్ చేయడం మొదలు రిలీజ్ దాకా వినూత్నంగా ప్రమోషన్లు నిర్వహించారు. పైగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం.

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Geethanjali Malli Vachindi
Follow us
Basha Shek

|

Updated on: May 05, 2024 | 4:37 PM

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. సుమారు పదేళ్ల తర్వాత సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీపై మొదట మంచి హైప్ ఏర్పడింది. శ్మశానంలో టీజర్ లాంఛ్ చేయడం మొదలు రిలీజ్ దాకా వినూత్నంగా ప్రమోషన్లు నిర్వహించారు. పైగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సందడి చేయలేకపోయింది. పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశపర్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజైన నెలలోపే అంటే మే 10వ తేదీన ఈ హార్రర్ సినిమా ఓటీటీలోకి రానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ, రవి శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భాను భోగవరపు, కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించారు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సినిమా షూటింగ్ కోసం ఓ పాడుబడిన మహల్ లోకి శ్రీనివాస రెడ్డి, అతని స్నేహితులు వెళ్లడం, అక్కడ వింత పరిస్థితులు ఎదురు కావడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగివచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఈ హర్రర్ కామెడీ మూవీని చూడాల్సిందే.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలి లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.