Manjummel Boys OTT: ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
రెండు రాష్ట్రాల్లోనూ ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ డిజిటిల్ ప్రీమియర్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అడియన్స్ నిరీక్షణకు తెర పడింది.
మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్. గత నెలలో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాన్ లాల్, దీపక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ బ్యానర్ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ డిజిటిల్ ప్రీమియర్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అడియన్స్ నిరీక్షణకు తెర పడింది.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది. దీంతో అడియన్స్ నిరీక్షణ తీరింది. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా ఇంట్లోనే చూసేయ్యోచ్చు. మంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళీ ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రం ఇదే.
కథ విషయానికి వస్తే.. తమిళనాడులోని కొడైకెనాల్ కు కొందరు ఫ్రెండ్స్ వెకేషన్ కు వెళ్తారు. ఆ గ్రూపులో ఓ స్నేహితుడు గుణ గుహలలో పడిపోతాడు. అతడిని కాపాడేందుకు ఇతర స్నేహితులు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా స్టోరీ సాగుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ చిదంబం తెరకెక్కించారు.
The wait is over, the boys have arrived. #ManjummelBoys is now streaming in Hindi, Malayalam, Tamil, Telugu and Kannada. #ManjummelBoysOnHotstar
Watch Now: https://t.co/Wsyqjp1ZrT pic.twitter.com/EzZr2Xrwq2
— Disney+ Hotstar (@DisneyPlusHS) May 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.