Thalaimai Seyalagam: ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్.. ‘తలమై సెయల్గమ్’స్ట్రీమింగ్ ఎక్కడంటే

‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత‌బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాధికా శ‌ర‌త్ కుమార్ రూపొందించారు.

Thalaimai Seyalagam: ఓటీటీలోకి వచ్చేస్తున్నపొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్.. ‘తలమై సెయల్గమ్’స్ట్రీమింగ్ ఎక్కడంటే
Thalamai Seyalagam
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2024 | 7:32 PM

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం జీ5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో స‌రికొత్త పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ ‘తలమై సెయల్గమ్’ మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళ రాజ‌కీయాల్లో అధికార దాహాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసే డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఇది రూపొందింది. 8 భాగాలుగా రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్లింగ్ సిరీస్‌ను రాడాన్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై జాతీయ అవార్డ్ గ్ర‌హీత వ‌సంత‌బాల‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రాధికా శ‌ర‌త్ కుమార్ రూపొందించారు. ఇందులో కిషోర్‌, శ్రియారెడ్డి, ఆదిత్య మీన‌న్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తమిళనాడులో రాజకీయాల మధ్య ఒక మహిళ అధికార దాహం, ఆశయం, ద్రోహం, విమోచనల‌ను తెలియ‌జేసే క‌థాంశంతో ఇది తెర‌కెక్కింది.

ఇది త‌మిళ రాజ‌కీయాల చుట్టూ న‌డిచే క‌థాంశం. ముఖ్య‌మంత్రి అరుణాచ‌లం అవినీతి ఆరోప‌ణ‌ల‌తో 15 సంవ‌త్స‌రాలుగా విచార‌ణ‌ను ఎదుర్కొంటుంటారు. ముఖ్య‌మంత్రి కావాల‌ని, ఆ ప‌ద‌వి కోసం వారిలో ఇది కోరిక‌ను మ‌రింత‌గా పెంచుతుంది. ఇదిలా ఉండ‌గా జార్ఖండ్‌లోని మారుమూల ప‌ల్లెటూరులో, రెండు ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన పాత మ‌ర్డ‌ర్ కేసుని సీబీఐ ఆఫీస‌ర్ వాన్ ఖాన్ ప‌రిశోధిస్తుంటారు. అదే స‌మ‌యంలో చెన్న నగ‌నంలో త‌ల‌, శ‌రీర‌భాగాలు వేరు చేయ‌బ‌డిన ఓ శ‌రీరం దొరుకుతుంది. ఈ భ‌యంక‌ర ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని క‌నిపెట్ట‌టానికి చెన్నై డీజీపీ మ‌ణికంద‌న్ ప‌రిశోధ‌న చేస్తుంటారు. క్ర‌మ‌క్ర‌మంగా న‌గ‌రంలో జ‌ర‌ర‌గుతున్న ఈ దుర్ఘ‌ట‌న‌ల వెనుకున్న నిజ‌మేంట‌నేది బ‌య‌ట‌కు వ‌స్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

రాడాన్ మీడియా వ‌ర్క్స్ అధినేత, నిర్మాత రాధికా శ‌ర‌త్ కుమార్ మాట్లాడుతూ ‘‘‘తలమై సెయల్గమ్’ సిరీస్‌ను జీ 5తో క‌లిసి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అందించ‌టం చాలా సంతోషంగా అనిపిస్తుంది. జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల ప్ర‌భావంతో పాటు జార్ఖండ్‌లోని కింది స్థాయి కార్య‌కర్త‌లు, తిరుగుబాటు గ్రూపుల మ‌ధ్య ఉండే సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఇది తెలియ‌జేస్తుంది. రాజకీయ వార‌స‌త్వానికి అతీతంగా ఓ మ‌హిళ అధికారంలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌నే ప‌రిస్థితుల‌పై సిరీస్‌ను రూపొందించారు. కొట్ర‌వై, దుర్గ‌, అభిరామి అనే మూడు పాత్ర‌లు, వాటి వెనుకున్న బ‌ల‌మైన భావోద్వేగాల‌ను, భావ‌జాలాల‌ను రూపొందించ‌టంలో ఉండే మ‌హిళ కీల‌క పాత్ర‌ల‌ను త‌ల‌మై సెయ‌ల్గ‌మ్ తెలియ‌జేస్తుంది.

న‌టి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇందులో నేను కొట్ర‌వై అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. ఇలాంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన సిరీస్‌లో భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వైవిధ్య‌మైన షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌టం అనేది న‌టిగా నాకు ఛాలెజింగ్‌గా అనిపించింది. మ‌నం మ‌న శ‌త్రువుకు ఎదురుగా క‌త్తితో నిల‌బ‌డ్డ‌ప్పుడు వాళ్లు మ‌న‌పై మ‌రిన్ని క‌త్తుల‌ను ప్ర‌యోగిస్తారు అనే సిద్ధాంతాన్ని న‌మ్మే పాత్రే నాది. ప్ర‌తీ విష‌యంలో ఓ లెక్క‌తో, సామ‌ర్థ్యంతో, ఎలాంటి చ‌డీ చ‌ప్పుడూ లేకుండా, న‌మ్మ‌కంతో త‌న ప‌నిని తాను చేసుకునే పాత్రే కొట్ర‌వైది. అస్థిర‌మైన రాజ‌కీయాలు, మ‌న వెనుక జ‌రిగే చీక‌టి ద‌ర్యాప్తులు, కుటుంబాల్లోని క‌ల‌హాలు, ప్ర‌మాద‌క‌ర‌మైన స్నేహాలతో పాటు త‌మిళనాట రాజ‌కీయాల‌ను ఇది తెలియజేస్తుంది. నేను కూడా జీ5లో త‌ల‌మై సెయ‌ల్గ‌మ్‌ను చూడ‌టానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?