Prasanna Vadanam: హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి...
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేసే సూర్య అలియాస్ సుహాస్ ఒక యాక్సిడెంట్ లో అమ్మానాన్నలను పోగొట్టుకుంటాడు. అదే ప్రమాదంలో ఆయనకు ఫేస్ బ్లైండ్ నెస్ అనే అరుదైన సమస్య వస్తుంది. దీనివల్ల మొహాలను గుర్తుపట్టలేక పోతాడు సూర్య. అదే సమయంలో ఆయన జీవితంలోకి ఆధ్యా అలియాస్ పాయల్ రాధాకృష్ణ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సూర్య. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. మొహాలను గుర్తుపట్టలేడు కాబట్టి అతడిని కొంతమంది ఆ కేసులో ఇరికించాలని చూస్తారు. ఈ మర్డర్ కేసులో నుంచి బయటపడడానికి ఏసీబీ వైదేహి అలియాస్ రాశి సింగ్ సూర్యకు ఎలాంటి సాయం చేసింది.. అందులోంచి సూర్య ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ..
కొన్నిసార్లు సినిమా కంటే అందులో ఉన్న ఒక పాయింట్ మనల్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. అలా ఎగ్జైట్ చేసిన సినిమా ప్రసన్న వదనం. ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు సుహాస్. ప్రసన్న వదనం లో కూడా ఇదే చేశాడు. సుహాస్ ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ చేయడనే నమ్మకంతో వచ్చిన ప్రేక్షకులకు ఆయన బాగానే న్యాయం చేశాడు. ముందుగా చెప్పినట్టు పాయింట్ ఎగ్జైట్ చేసింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. సొంత మొహం కూడా గుర్తు పట్టలేని ఒకడు.. మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్.
ఇక డైరెక్టర్ అర్జున్.. సుకుమార్ శిష్యుడు కాబట్టి చాలా వరకు లాజికల్ గా కథ రాసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. కథ ముందుకు వెళుతున్న కొద్దీ ఎక్కడికక్కడ ట్విస్టులు బయటపడుతూ ఉంటాయి. ఫేస్ బ్లైండ్ నెస్ తో హీరో పడే ఇబ్బందులు.. తొలి అరగంట ఎంటర్టైన్మెంట్ గా చూపించాడు దర్శకుడు. కానీ దాని వల్లే సమస్యలో ఇరుక్కుంటే ఏమవుతుంది అనేది తర్వాత చూపించాడు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే రొటీన్ కథ ఇది. కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు. కాన్సెప్ట్ కొత్తగా ఉండడంతో సినిమా కూడా మెప్పిస్తుంది. మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్.. క్లైమాక్స్ బాగున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.