Aa Okkati Adakku: హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

Aa Okkati Adakku: హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?

Anil kumar poka

|

Updated on: May 04, 2024 | 9:50 PM

అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ ఈ మధ్య ఆయనే రూట్ మార్చుకుని సీరియస్ వైపు వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆయన మనసు మళ్లీ కామెడీ వైపు మళ్లింది. మరి అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.. అల్లరి నరేష్ మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

అల్లరి నరేష్ సినిమాలంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది కామెడీనే. కానీ ఈ మధ్య ఆయనే రూట్ మార్చుకుని సీరియస్ వైపు వెళ్లాడు. చాలా రోజుల తర్వాత ఆయన మనసు మళ్లీ కామెడీ వైపు మళ్లింది. మరి అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.. అల్లరి నరేష్ మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

వైజాగ్ రిజిస్టర్ ఆఫీసులో పని చేసే గణపతి అలియాస్ అల్లరి నరేష్కు వయసు దాటిపోయినా పెళ్లి కాదు. తండ్రి చనిపోయిన తర్వాత.. కుటుంబ భారం అంతా భుజాన వేసుకుంటాడు గణపతి. ఈ క్రమంలోనే తన పెళ్లి గురించి కూడా మర్చిపోతాడు. తమ్ముడికి పెళ్లైనా కూడా.. అన్న గణపతికి మాత్రం పెళ్లి కాదు. దాంతో అంతా వింతగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మాట్రిమోనీ సంస్థ ద్వారా సిద్ది అలియాస్ ఫరియా అబ్దుల్లాని కలుస్తాడు. చూసిన వెంటనే అతడిలో ఇష్టం కలుగుతుంది. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మాత్రం నువ్వు నచ్చలేదని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో అమ్మ కోసం ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోడానికి రెడీ అయిపోతాడు గణపతి. అదే సమయంలో మళ్లీ గణ జీవితంలోకి వస్తుంది సిద్ధి. కానీ అనుకోకుండా సిద్ధితో పాటు గణపతి కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అప్పుడేం జరిగింది.. అసలేంటి కథ అనేది పూర్తి సినిమాలో చూడాలి..

అయితే అటుండు.. లేదంటే ఇటుండు.. నీలాగా మధ్యలో ఉండేవాళ్లతో ఎవరికీ ఉపయోగం లేదు. ఆ ఒక్కటి అడక్కు చూసాక ఎందుకో టెంపర్ సినిమాలోని ఈ డైలాగ్ గుర్తుకొచ్చింది. కామెడీ ఇక వద్దు.. సీరియస్ ముద్దు అంటూ అటువైపు వెళ్లాడు అల్లరి నరేష్. మూడేళ్లు అలా సీరియస్‌గా ఉన్నాడో లేదో.. మళ్లీ ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ వైపు వచ్చాడు. కానీ మునపట్లా నవ్వించడంలో మాత్రం నరేష్ సక్సెస్ కాలేదు.. ఆయనలో కామెడీ టైమింగ్ అలాగే ఉందేమో కానీ దానికి తగ్గ కథ కూడా దొరికాలిగా. ఆ ఒక్కటి అడక్కులో మాత్రం అదొక్కటే తక్కువైందేమో అనిపిస్తుంది. ఎప్పుడో పదేళ్ల కింద రావాల్సిన సినిమా ఇప్పుడొచ్చిందేమో అనిపించింది.

పైగా పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ కథ. పెళ్లి కాని మిడిల్ ఏజ్ పర్సన్ ఫ్రస్టేషన్స్ బాగానే చూపించాడు కానీ కథలో మాత్రం ఆ పస లేదు. అక్కడక్కడా ఒకట్రెండు చోట్ల పేలిన జోకులు మినహాయిస్తే.. కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మాట్రిమోనీ పేరుతో జరిగే మోసాల్ని మాత్రం బాగా చూపించాడు దర్శకుడు మల్లి అంకం. పెళ్లి పేరుతో జరిగే వేల కోట్ల స్కామ్‌పై బాగా ఫోకస్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. అన్నిచోట్లా కథ అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

ఇక మధ్యలో షకలక శంకర్, వైవా హర్ష ట్రాక్స్ కూడా కావాలని ఇరికించినట్లు అర్థమవుతుంది. కామెడీ కథలోంచి పండితే అద్భుతంగా ఉంటుంది కానీ ఈ సినిమాలో అది కనిపించదు. ఎంతసేపు ఇరికించే కామెడీ కోసమే చూసాడు దర్శకుడు. అయితే జానీ లివర్ కూతురు జామీతో వచ్చే సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అల్లరి నరేష్, జామీ మధ్య జరిగే సంభాషణలు నవ్విస్తాయి. వెన్నెల కిషోర్ ట్రాక్ కూడా కొంతవరకు బెటర్. పెళ్లి కానీ కుర్రాళ్ల గోడు బాగానే చూపించారు. సెకండాఫ్‌తో పోలిస్తే ఫస్టాఫ్ కాస్త బెటర్. హీరోయిన్ తాళూకు ట్విస్ట్ కూడా ఏమంత గొప్పగా అనిపించదు. ఆమెలో మార్పు వచ్చే సీన్స్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించవు. ఓవరాల్‌గా ఆ ఒక్కటి అడక్కులో కామెడీ అడక్కూడదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.