TOP9 ET: విదేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్ డేట్ ఫిక్స్.?

TOP9 ET: విదేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్ డేట్ ఫిక్స్.?

Anil kumar poka

|

Updated on: May 04, 2024 | 9:55 PM

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 సినిమాలోని పుష్ప.. పుష్ప సాంగ్‌తో.. సెన్సేషన్‌గా మారిపోయారు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప లిరికల్ సాంగ్.. జస్ట్ 24 గంటల్లోనే 26.6 మిలియన్ వ్యూస్‌ను యూట్యూబ్లో రాబట్టింది. అదే రియల్ టైం వ్యూ కౌంట్‌ 40 మిలియన్‌ ప్లస్‌గా ఉంది. దీంతో ఇప్పటి వరకు ఈ రేంజ్‌ వ్యూస్ కౌంట్‌ రాబట్టిన ఫస్ట్ సాంగ్‌గా రికార్డ్‌కెక్కింది పుష్ప.. పుష్ప సాంగ్.

01.Pushpa: వావ్‌! ఆల్‌ టైం రికార్డ్‌ క్రియేట్‌ చేసిన పుష్ప.. పుష్ప

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 సినిమాలోని పుష్ప.. పుష్ప సాంగ్‌తో.. సెన్సేషన్‌గా మారిపోయారు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప.. పుష్ప లిరికల్ సాంగ్.. జస్ట్ 24 గంటల్లోనే 26.6 మిలియన్ వ్యూస్‌ను యూట్యూబ్లో రాబట్టింది. అదే రియల్ టైం వ్యూ కౌంట్‌ 40 మిలియన్‌ ప్లస్‌గా ఉంది. దీంతో ఇప్పటి వరకు ఈ రేంజ్‌ వ్యూస్ కౌంట్‌ రాబట్టిన ఫస్ట్ సాంగ్‌గా రికార్డ్‌కెక్కింది పుష్ప.. పుష్ప సాంగ్. ఇక ఈ సాంగ్‌ తర్వాత విజయ్‌ దళపతి విజిల్ పోడు సాంగ్ 24.8మిలియన్ వ్యూస్‌తో.. సెకండ్ ప్లేస్‌లో ఉంది.

02. pushpa: విదేశీ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తోన్న పుష్ప.. పుష్ప సాంగ్

ఓ తెలుగు సాంగో.. లేక బాగా తెలిసిన స్టార్ సాంగో రిలీజ్ అయితే.. తెలుగు టూ స్టేట్స్‌ యూట్యూబ్‌ రీజియన్లో.. లేక ఇండియన్ రీజియన్లో ట్రెండ్ అవుతుంది. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్స్‌ పుష్ప.. పుష్ప సాంగ్ మాత్రం.. ఇండియన్ బార్డర్ దాటి విదేశాల్లో కూడా ట్రెండ్ అవుతోంది. పుష్ప.. పుష్ప.. తెలుగు వర్షన్ సాంగ్ ఇండియాతో పాటు.. బహ్రెయిన్ లో నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. సింగపూర్‌ లో 21వ స్థానంలో.. యూకేలో 25వ స్థానంలో.. కెనడాలో 26వ స్థానంలో.. ఊర్లాండ్‌లో 28వ స్థానంలో ట్రెండ్ అవుతూ.. త్రూ అవుట్ వరల్డ్‌ .. అక్కడ కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ సాంగ్.

03.pawan: హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్?

రీసెంట్గా వచ్చిన అప్డేట్తో.. పవన్‌ హరి హర వీరమల్లు గురించి ముచ్చటగా మూడు విషయాలు తెలిశాయి. ఈసినిమా ఆగిపోలేదని.. డైరెక్టర్‌ మారారని.. రెండు పార్ట్స్‌గా ఈ సినిమా రిలీజ్ కానుందని! ఇక ఈ 3 విషయాలతో పాటు.. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై ఇండస్ట్రీలో ఓ టాక్ వైరల్ అవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. పవన్ హరి హర వీర మల్లు ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందట. మరి మేకర్స్ ఈ టాక్ పై ఎం చెబుతారో.. వెయిట్ అండ్ సీ..!

04.jakkanna: 15 ఏళ్ల నాటి మాట నిలబెట్టుకున్న జక్కన్న.

మాట తప్పడం.. మడమ తిప్పడం.. జక్కన్న వంశంలోనే లేదన్నట్టుండి. అందుకే అన్నట్టు.. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ప్రొడ్యూసర్ కే ఎల్ నారాయణకు జక్కన్న ఇచ్చిన మాటను ఇప్పుడు నిలుపుకున్నాడు. అడక్క పోయినా.. అప్పటి మాటకు కట్టుబడి.. ఇప్పుడు జక్కన్న- మహేష్ సినిమాను ప్రొడ్యూస్‌ చేసే చాన్స్‌ను నారాయణకు ఇచ్చారు జక్కన్న. ఇక ఇదే విషయాన్ని రీసెంట్‌గా రివీల్ చేశారు ప్రొడ్యూసర్ నారాయణ. రివీల్ చేయడమే కాదు జక్కన్న మహేష్ సినిమాకు బడ్జెట్ అంతా ఇంతా అంటూ ఏం లేదని..సినిమాకు ఎంత కావాలో అంత ఇస్తా అని చెప్పారు కూడా..!

05.krish: ఇప్పుడే కాదు.. అప్పుడు కూడా ఈ డైరెక్టర్‌కు.. తీవ్ర అన్యాయం జరిగింది..

హరి హర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ బయటికి వచ్చేశారనే న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్‌గా క్రిష్‌తో పాటు.. మరో డైరెక్టర్ జ్యోతి కృష్ణ పేరు కూడా రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్లో కనిపించడం అంతటా హాట్ టాపిక్ అయింది. అంతేకాదు క్రిష్‌కు హరి హర సినిమా విషయంలో అన్యాయం జరిగిందనే కామెంట్ కూడా నెటిజన్ల నుంచి వచ్చింది. అయితే క్రిష్కు ఇలా ఇప్పుడే కాదు.. గతంలో కూడా జరిగింది. కంగనా రనౌత్ హీరోయిన్గా మణికర్ణిక సినిమాను గ్రాండ్ స్కేల్లో మొదలెట్టిన క్రిష్‌ను.. ఆ సినిమా షూటింగ్ సగం అవగానే మేకర్స్ తప్పించారు. బదులుగా కంగననే డైరెక్టర్‌గా చేశారు. దీంతో ఇప్పుడే కాదు.. అప్పట్లో కూడా ఈ డైరెక్టర్‌కు తీవ్ర అన్యాయం జరిగిందిని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.

06. prabhu: ప్రభుదేవా నిర్వాకానికి మూర్ఛ పోయిన పిల్లలు?

ప్రభుదేవా చేసిన నిర్వాకానికి స్కూలు విద్యార్థులు మూర్ఛ పోయారు. రీసెంట్‌గా ఇంటర్నేషనల్ డ్యాన్స్‌ డే సందర్భంగా.. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా, చెన్నైలోని రాజరత్నం మైదానంలో ప్రభుదేవా ఎంపిక చేసిన 100 పాటలకు 100 నిమిషాల డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా 5000 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుదేవా ప్రత్యేక అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ప్రభుదేవా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే అయన కోసమే వచ్చి ఉదయం నుంచి ఎండలోనే బారులు తీరిన చిన్నారుల్లో.. చాలా మంది ఎండ తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారట.

07.pooja: ఫీల్డ్‌లోకి వచ్చిన నయా రాధిక.. పూజా దశ తిరుగుతది ఇక!

అందమైనా.. నాజూకైన అమ్మాయిలతో.. రాధికల బ్యాచ్‌ను తయారు చేసే పనిలో ఉన్నట్టు ఉన్నాడు మన టిల్లు గాడు. నేహా, అనుపమ తర్వాత మన కోసం నయా రాధికగా… పూజా హెగ్డేన్‌ను తీసుకొస్తున్నాడు. ఎస్! అకార్డింగ్ టూ లెటెస్ట్ న్యూస్… టిల్లు క్యూబ్‌ కోసం.. సిద్దు జొన్నల గడ్డ.. పూజా హెగ్డేను హీరోయిన్‌గా పిక్ చేసుకున్నారట. మేకర్స్ కూడా ఓకే చెప్పడంతో.. పూజా లైన్లో తీసుకునే పనిలో ఉన్నారట మన టిల్లు.

08.kapil: ఒక్కో ఎపిసోడ్‌కు 5 కోట్లు? కపిల్‌ శర్మ కిర్రాక్ సంపాదన

అందరికీ ఏమో కానీ.. కపిల్ శర్మకు మాత్రం జస్ట్ నవ్విస్తేనే కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడుతోంది. నిన్న కాక మొన్నటి వరకు కామెడీ విత్ కపిల్ శర్మ షోతో సాటిలైట్‌ ఫీల్డ్‌లో.. సందడి చేసిన ఈ కమెడియన్.. ఇప్పుడు ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షోను రన్‌ చేస్తున్నాడు. రన్‌ చేయడమే కాదు.. అందుకు గాను.. ఒక్క ఎపిసోడ్‌కు దాదాపు 5 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట ఈయన. ఇప్పుడు ఇదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. మనోడి కిర్రాక్ సంపాదన సోషల్ మీడియాలో అయితే.. చిన్న పాటి సెన్సేషన్ గా మారింది.

09.sonali: నిర్మాతలు కావాలనే.. ఆ రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లు

ఓ సినిమా మొదలైంది మొదలు.. ఆ సినిమాలో యాక్ట్ చేసే హీరో.. హీరోయిన్‌ మధ్య ఎఫైర్ ఉందంటూ.. డేటింగ్‌లో వారు మునిగి తేలుతున్నట్టు వార్తల మీద వార్తలు వస్తుంటాయి. అయితే ఆ వార్తలను పుట్టించేది ఎవరో కాదు.. ఆ సినిమా ప్రొడ్యూసర్లే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు హీరోయిన్ సోనాలి బింద్రే. తమ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేందుకు.. ఫ్రీ పబ్లిసిటీ అయ్యేందుకు ఇలాంటి రూమర్స్‌ను కావాలనే ప్రొడ్యూసర్లు పుట్టిస్తున్నారని అన్నారు. తన విషయంలో కూడా ఇలా జరిగిందని.. కానీ తెలిసినా.. అందరూ లైట్ తీసుకుంటారని అన్నారు. తన మాటలతో ఇప్పుడు మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.