AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ దాదాపు ఓటీటీలోకి వచ్చేశాయి. చివరకు 400 కోట్ల కలెక్షన్లు సాధించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి రవితేజ భర్త మహాశయుకుల విజ్ఞప్తి సినిమా స్ట్రీమింగ్ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' స్ట్రీమింగ్ డేట్ ఇదే
Bhartha Mahasayulaku Wignyapthi
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 6:50 AM

Share

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులో ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమాలన్నీ ఓటీటీలనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రభాస్, శర్వానంద్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు సినిమాల అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్స్ వచ్చేశాయి. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నారు. ఈ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. అలాగే సునీల్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర