Mayalodu: ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మాయలోడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మ్యాజిక్ చేసే వాడిగా నటించారు. రోడ్డు మీద మ్యాజిక్ షో చేసుకునే రాజేంద్ర ప్రసాద్ కు ఓ పాప కనిపిస్తుంది. ఆ పాపను చేరదీసి ఆ పాపకు ఉన్న కష్టాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి కోసం విలన్స్ తో పోరాటం చేస్తాడు.

Mayalodu: ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
Chinuku Chinuku Andelatho
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2024 | 7:24 PM

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన చేయని పాత్ర లేదేమో అనేలా సినిమాలు చేసి మెప్పించారు రాజేంద్ర ప్రసాద్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సూపర్ హిట్ సినిమాలో మాయలోడు సినిమా ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మాయలోడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మ్యాజిక్ చేసే వాడిగా నటించారు. రోడ్డు మీద మ్యాజిక్ షో చేసుకునే రాజేంద్ర ప్రసాద్ కు ఓ పాప కనిపిస్తుంది. ఆ పాపను చేరదీసి ఆ పాపకు ఉన్న కష్టాన్ని తెలుసుకొని ఆ అమ్మాయి కోసం విలన్స్ తో పోరాటం చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. 1993లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

రాజేంద్ర ప్రసాద్ సరసన ఈ సినిమాలో సౌందర్య నటించారు. మనీషా ఫిల్మ్ పతాకంపై కె. అచ్చిరెడ్డి, కిశోర్ రాఠీ నిర్మించారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాబు మోహన్ కు సౌందర్యకు మధ్య ఓ సాంగ్ ఉంటుంది. చినుకు చినుకు అందెలతో అనే సాంగ్. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌందర్య లాంటి హీరోయిన్ బాబు మోహన్ తో సాంగ్ చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

అయితే ఇదే సాంగ్ కోసం ప్రేక్షకులు థియేటర్స్ దగ్గర ఎగబడ్డారట. ఈ ఒక్క సాంగ్ కోసం సినిమా ఏకంగా ఏడాది పాటు సినిమా ఆడింది. అయితే ఓసారి బాబు మోహన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ థియేటర్ కు వెళ్లారట. అయితే బయట హౌస్ ఫుల్ అనే బోర్డు పెట్టారట. అయితే థియేటర్ మేనేజర్ దగ్గరకు వెళ్లి చూశారట నిజంగానే హౌస్ ఫుల్ అయ్యిందా లేక ఊరికే ఇలా బోర్డు పెట్టారా అని.. అయితే థియేటర్స్ లో గట్టిగా వందమంది కూడా లేరట. దాంతో మేనేజర్ పైన సీరియస్ అయ్యారట బాబు మోహన్. అయితే మీరు కంగారు పడకండి చూడండి ఏం జరుగుతుందో అని అన్నాడట. అయితే చినుకు చినుకు సాంగ్ మొదలవ్వగానే జనాలు తండోపతండాలుగా వచ్చారట. అప్పటివరకు లేని జనాలు ఒక్కసారిగా థియేటర్స్ లో నిండిపోయారట. అప్పుడు ఆ మేనేజర్ చెప్పారట. టికెట్స్ తీసుకొని ఈ సాంగ్ కోసమే సినిమాకోసం వస్తున్నారు సార్ అని చెప్పాడట. అది చూసి బాబు మోహన్ షాక్ అయ్యారట. ఆ సాంగ్ ప్రేక్షకులను అంతగా ఆదరించారు అని బాబు మోహన్ చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!