Aadujeevitham OTT: ‘ఆడు జీవితం’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళ సూపర్ స్టార్, సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ఆడు జీవితం (ది గోట్ లైఫ్). సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ సమాహారంతో జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

Aadujeevitham OTT: 'ఆడు జీవితం' ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Aadujeevitham Movie
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2024 | 9:17 PM

మలయాళ సూపర్ స్టార్, సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ఆడు జీవితం (ది గోట్ లైఫ్). సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ సమాహారంతో జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఆడు జీవితం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఓవరాల్ గా రూ.150 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో ఒకటిగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థియేటర్లలో ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించిన ఆడు జీవితం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పృథ్వీరాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 30 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. కాగా మొదట మే 10న ఆడు జీవితం ఓటీటీలోకి వస్తుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ తేదీ మారిందని సమాచారం. మే 26 నుంచి ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చడం విశేషం స్ట్రాంగ్ కంటెంట్ ఉండడంతో తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేయడం విశేషం. ఇక ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు.

ఇవి కూడా చదవండి

ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే