AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geethanjali Malli Vachindi OTT: అఫీషియల్.. ఆహాలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగమ్మాయి అంజలి నటించిన 50వ సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. సుమారు పదేళ్ల క్రితం చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకులను బాగా భయపెట్టిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీపై మొదట మంచి హైప్ వచ్చింది. శ్మశానంలో టీజర్ లాంఛ్ చేయడం మొదలు రిలీజ్ దాకా వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించారు

Geethanjali Malli Vachindi OTT: అఫీషియల్.. ఆహాలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Geethanjali Malli Vachindi Movie
Basha Shek
|

Updated on: May 06, 2024 | 7:42 PM

Share

తెలుగమ్మాయి అంజలి నటించిన 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. సుమారు పదేళ్ల క్రితం చిన్న సినిమాగా రిలీజై ప్రేక్షకులను బాగా భయపెట్టిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీపై మొదట మంచి హైప్ వచ్చింది. శ్మశానంలో టీజర్ లాంఛ్ చేయడం మొదలు రిలీజ్ దాకా వెరైటీగా ప్రమోషన్లు నిర్వహించారు. పైగా అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు, అంచనాలతో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఆడియెన్స్ ను బాగానే భయపెట్టించింది. అలాగే కడుపుబ్బా నవ్వించింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే అంటే మే 8 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ఈ సందర్భంగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ‘అక్క మళ్లీ వచ్చావా.. అయితే సరే ఆహాలో కలుద్దాం’ అని దీనికి క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలితో పాటు నివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

మే8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలి లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?