T20 World Cup 2024: టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా? ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కోసం సోమవారం (మే 06) టీమ్ ఇండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అడిడాస్ స్పాన్సర్ చేసిన ఈ కొత్త జెర్సీలో నీలం, ఆరెంజ్ కలర్స్ కాంబినేషన్ లో రూపొందింది. అలాగే భారత జట్టు ట్రేడ్‌మార్క్ కలర్ అయిన బ్లూ జెర్సీ స్లీవ్‌లపై కాషాయం రంగను అద్దారు.
ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కోసం సోమవారం (మే 06) టీమ్ ఇండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అడిడాస్ స్పాన్సర్ చేసిన ఈ కొత్త జెర్సీలో నీలం, ఆరెంజ్ కలర్స్ కాంబినేషన్ లో రూపొందింది. అలాగే భారత జట్టు ట్రేడ్‌మార్క్ కలర్ అయిన బ్లూ జెర్సీ స్లీవ్‌లపై కాషాయం రంగును జోడించారు. ఇకత్రివర్ణ పతాకాన్ని సూచించేవిధంగా జెర్సీ కాలర్‌పై కాషాయం, తెలుగు, గ్రీన్ కలర్స్ తో కూడిన స్ట్రిప్స్ ఇచ్చారు. ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాషాయం రంగు కాస్త ఎక్కువైందంటూ కామెంట్లు వచ్చినా ఓవరాల్ గా జెర్సీ బాగుందంటున్నారు క్రికె ట్ అభిమానులు. ఇదిలా ఉంటే ఈ కొత్త జెర్సీ ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీనిని అడిడాస్ అధికారిక స్టోర్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అడిడాస్ ఆన్‌లైన్ స్టోర్‌లో టీమ్ ఇండియా కొత్త జెర్సీ ధర 5,999 రూపాయలు. త్వరలోనే వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీకోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
రిజర్వ్‌లు:
శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.
హెలికాప్టర్ తో టీమిండియా జెర్సీ లాంఛింగ్, వీడియో
INDIA’S T20 WORLD CUP JERSEY LAUNCH IN DHARAMSHALA. 👌🇮🇳
– Rohit, Jadeja, Kuldeep featured in the launch video. pic.twitter.com/XZ4PeAz9Qq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 6, 2024
కొత్త జెర్సీల్లో టీమిండియా క్రికెటర్లు..
It’s only beating the world. #YouGotThis. The new team India t20 jersey is now available in stores across India and on https://t.co/8XCz8p5KGu#T20WorldCup pic.twitter.com/ZBHh38DfLy
— adidas (@adidas) May 7, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..