Shakib Al Hassan: బుద్ధి మారని షకీబ్ .. సెల్ఫీ అడిగిన గ్రౌండ్ మెన్ కాలర్ పట్టుకుని, మొబైల్ లాక్కుని.. వీడియో
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఈ మధ్యన వివాదాల్లో ఉండటం అలవాటుగా మారింది. క్రికెట్‌తో పాటు ఇతరేతర విషయాల్లోనూ అతని పేరు ఈ మధ్యన బాగా వినిపిస్తోంది. మైదానంలో తరచూ అంపైర్లు, ఆటగాళ్లతో గొడవకు దిగే షకీబ్ పలు సార్లు అభిమానులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తుంటాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు ఈ మధ్యన వివాదాల్లో ఉండటం అలవాటుగా మారింది. క్రికెట్‌తో పాటు ఇతరేతర విషయాల్లోనూ అతని పేరు ఈ మధ్యన బాగా వినిపిస్తోంది. మైదానంలో తరచూ అంపైర్లు, ఆటగాళ్లతో గొడవకు దిగే షకీబ్ పలు సార్లు అభిమానులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. ఫ్యాన్స్ ను చెంప దెబ్బలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాగే దురుసుగా ప్రవర్తించాడు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్. సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఒక గ్రౌండ్స్ మెన్‌ను కాలర్‌కు పట్టుకున్నాడు. అతని మొబైల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. అంతేకాదు అతనని చెంపదెబ్బ కొట్టేందుకు ట్రై చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఒక సెల్ఫీ అడిగిన దానికి బంగ్లా కెప్టెన్ ఇలా అతిగా ప్రవర్తించడంపై క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆటగాళ్లు ఆడేందుకు పిచ్‌ను సిద్ధం చేస్తారు గ్రౌండ్స్‌మన్. క్రికెట్ ఆడేందుకు అనువుగా మైదానాన్ని తయారు చేయడం వారి బాధ్యత. అలాంటి గ్రౌండ్స్ మెన్ ముచ్చట పడి సెల్ఫీ అడిగితే షకీబ్ ఇలా దారుణంగా ప్రవర్తించడం బాగోలేదంటున్నారు ఫ్యాన్స్. పైగా అక్కడ జనం కూడా లేరని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
ఇదేం బాగోలేదు..
సరే, ఇది షకీబ్ అల్ హసన్ వ్యక్తిగత విషయం, ఇది అతని వ్యక్తిగత ఆలోచన కూడా కావచ్చు. ఇలా సెల్ఫీలు దిగడం అతనికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒక గ్రౌండ్స్ మెన్ పట్ల ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారు? సెల్ఫీ వద్దని చెప్పినా గ్రౌండ్స్‌మన్ చెప్పినా వినేవాడేమో. కానీ షకీబ్ అతన్ని నేరుగా వెనక్కి నెట్టి కాలర్ పట్టుకుని మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. పైగా కొడతానంటూ చేయి పైకి ఎత్తాడు. షకీబ్ అల్ హసన్ దురుసుగా ప్రవర్తించడంతో గ్రౌండ్స్‌మ్యాన్ కూడా తీవ్రంగా బాధపడ్డాడు, వీడియో చివరలో అఅతను సైలెంట్ గా కూర్చోవడం మనం చూడవచ్చు.
వీడియో ఇదిగో..
Shakib al Hasan 🇧🇩🏏 went to beat a fan who tried to take a selfie 🤳
Your thoughts on this 👇👇👇 pic.twitter.com/k0uVppVjQw
— Fourth Umpire (@UmpireFourth) May 7, 2024
షకీబ్ ప్రొఫెషనల్ కెరీర్ విషయానికొస్తే, అతను ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతోంది. ఇందులో షకీబ్ ఆడడం లేదు. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరపున ఇప్పటివరకు 67 టెస్టులు, 247 ODIలు, 117 T20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 15000 పరుగులు చేశాడు. అంతే కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో అతని పేరిట దాదాపు 700 వికెట్లు కూడా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..