Devara Movie: ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి.. ఆస్పత్రిలో చేరిన 20 మంది ఆర్టిస్టులు.. అసలు ఏమైందంటే?

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర'. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.

Devara Movie: ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి.. ఆస్పత్రిలో చేరిన 20 మంది ఆర్టిస్టులు.. అసలు ఏమైందంటే?
Jr.NTR's Devara
Follow us
Basha Shek

|

Updated on: May 06, 2024 | 9:31 PM

జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాల భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చాయి. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఫారెస్ట్ రీజియన్‌ లో దేవరకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి జరిగింది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జూనియర్‌ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న సుమారు 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ లేరు. ఆయన ప్రస్తుతం ‘వార్‌2’ సినిమా షూటింగ్ లో బిజిబిజీగా ఉంటున్నారు. విశాఖపట్నంలో మొదట ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే తేనెటీగల దాడి జరిగిందని సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో మరో మలయాళ భామ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, నరైన్, టామ్‌ షైన్‌ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే