Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారుగా.. మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన లారెన్స్.. వీడియో

ఆ మధ్యన మాత్రం అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి లారెన్స్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నారీ రియల్ హీరో. తాజాగా విల్లుపురం జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబానికి స్వయంగా అతనే ట్రాక్టర్‌ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు

Raghava Lawrence: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారుగా.. మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన లారెన్స్.. వీడియో
Raghava Lawrence
Follow us
Basha Shek

|

Updated on: May 19, 2024 | 9:44 PM

కోలీవుడ్ హీరో, డైరెక్టర్ ‌ రాఘవ లారెన్స్‌ సేవ కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి ‘నేనున్నానంటూ’ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఆ మధ్యన మాత్రం అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి లారెన్స్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నారీ రియల్ హీరో. తాజాగా విల్లుపురం జిల్లాలోని ఓ పేద రైతు కుటుంబానికి స్వయంగా అతనే ట్రాక్టర్‌ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం విల్లుపురం జిల్లాలోని ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్‌ తాళాలు అందజేశానని అందులో తెలిపారు లారెన్స్. ‘మీ ప్రేమ, అభిమానాలను చూస్తుంటే.. నాకు మరింత శక్తిని ఇస్తున్నాయి.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోంది. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం’ అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లారెన్స్ మంచి తనానికి ఆకాశమే హద్దంటూ, ఆయన మరెన్నో మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురుస్తున్నారు.

రాజకీయాల్లేవ్.. సేవ మాత్రమే

ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని వితంతువులు తమకు కుట్టుమిషన్లు కావాలని లారెన్స్ ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే 500 కుట్టు మిషన్ల ను అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘ మేము ఈ వ్యవస్థను ఇప్పుడే ప్రారంభించాం. ప్రస్తుతం ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్న నటుడు SJ సూర్య, KPY బాల అరంతంగి నిషాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందులో రాజకీయం లేదు, సేవ మాత్రమే’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మహిళా ఆటో డ్రైవర్లతో రాఘవ లారెన్స్.. వీడియో

రైతుకు ట్రాక్టర్ అంజేస్తున్న రాఘవ లారెన్స్.. వీడియో

దివ్యాంగులకు త్రీ వీలర్ బైక్స్ పంపిణీ.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.