Shahid Kapoor: ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.

Shahid Kapoor: ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.

Anil kumar poka

|

Updated on: May 07, 2024 | 10:43 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కబీర్ సింగ్, జెర్సీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోగా స్టార్ డమ్ అందుకున్న షాహిద్.. నిజ జీవితంలో మాత్రం ప్రేమలో ఒడిపోయాడు. లవ్, బ్రేకప్ గురించి ఆసక్తి కామెంట్స్ చేశాడు. నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కబీర్ సింగ్, జెర్సీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోగా స్టార్ డమ్ అందుకున్న షాహిద్.. నిజ జీవితంలో మాత్రం ప్రేమలో ఒడిపోయాడు. లవ్, బ్రేకప్ గురించి ఆసక్తి కామెంట్స్ చేశాడు. నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లికి ముందు తన మాజీ ప్రియురాళ్లు తనను మోసం చేశారని.. ప్రేమ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని దురదృష్టకరమని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇక తన షోలో ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయావని నేహా అడగ్గా.. షాహిద్ ఒక్కసారిగా నవ్వేశాడు. నవ్వడమే కాదు “ఒక మోసం గురించి నాకు తెలుసు. నేను కచ్చితంగా దాని గురించి మాట్లాడగలను. కానీ మరొకదాని గురించి చాలా పెద్ద సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మాట్లాడాకూడదని అనుకుంటున్నాను. వాటికి నేను ఎలాంటి పేరు పెట్టను” అంటూ ఆన్సర్ ఇచ్చాడు.

ఇక షాషిద్ ఇచ్చిన ఆన్సర్ను కోట్ చేసిన నేహా…మీరు మాట్లాడుతుంది.. కరీనా కపూర్, ప్రియాంక చోప్రా గురించేనా? అని మొహమాటం లేకుండా అగిడేశారు. అందుకు రియాక్షన్ లెస్‌గా చూస్తుండి పోయాడు. ఇప్పుడు తన రియాక్షన్ తో నెట్టిట హాట్ టాపిక్ అవుతున్నాడు. రెండు సార్లు బ్రేకప్‌లను తట్టుకోవడం గ్రేట్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.