Ramya Krishnan: కొన్ని సార్లు సర్దుకుపోవాలి.. కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోయిన్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పారు. తాజాగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది.
కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఎవరో ఒకరు తమకు ఎదురైన చేదు అనుభవం గురించి మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు పెడుతున్నారు. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా మంచి హీరోయిన్స్ కామెంట్స్ చేశారు. స్టార్ హీరోయిన్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పారు. తాజాగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే రమ్యకృష్ణ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో నటించి మెప్పించారు. తాజాగా రమ్యకృష్ణ లేటెస్ట్ గా కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.
తాజాగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉంటుందని అన్నారు రమ్యకృష్ణ. అయితే సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరూ సినిమా ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని అన్నారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారాయి. రమ్యకృష్ణ కామెంట్స్ పై చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
రమ్యకృష్ణ ఇన్ స్టా ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.