Dhanush: ధనుష్ కి పుత్రోత్సాహం.. స్టార్ హీరో కుమారుడికి ఇంటర్‌లో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పుత్రోత్సాహంలో పొంగిపోతున్నాడు. అతని పెద్ద కుమారుడు రాజా యాత్ర ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు సాధించాడు. దీంతో హీరో ధనుష్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, నెటిజన్లు ధనుష్ కుమారుడికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Dhanush: ధనుష్ కి పుత్రోత్సాహం.. స్టార్ హీరో కుమారుడికి  ఇంటర్‌లో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?
Dhanush Son
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2024 | 7:59 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పుత్రోత్సాహంలో పొంగిపోతున్నాడు. అతని పెద్ద కుమారుడు రాజా యాత్ర ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు సాధించాడు. దీంతో హీరో ధనుష్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, నెటిజన్లు ధనుష్ కుమారుడికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. న్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకుంటున్న యాత్ర రాజా 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్‌ 100కి 98 మార్కులు, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ధనుష్ పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగుతోంది. అయితే ఈ మార్కులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. హీరో ధనుష్ కూడా తన కొడుకు 12వ మార్కులకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోలేదు.

కాగా హీరో ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్‌ లు విడాకులు తీసుకున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరు సుమారు 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా జీవించారు. తమ ప్రేమానుబంధానికి ప్రతీకగా రాజా యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూఆ ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో గత రెండేళ్లుగా వేర్వేరుగానే ఉంటున్నారు ధనుష్, ఐశ్వర్య. అయితే విడిపోయినప్పటికీ తమ పిల్లలను ఇద్దరూ బాధ్యతగానే చూసుకుంటున్నారు. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా రాజా యాత్ర,లింగ కనిపించారు. ఇక ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఈవెంట్ లో ఇద్దరూ కూడా కలిసి సందడి చేశారు హీరో. ప్రస్తుతం రాజా యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకుంటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే..  ధనుష్ చివరిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించాడు. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన కెప్టెన్ మిల్లర్ యావరేజ్ గా నిలిచింది. ఇక ఐశ్వర్య విషయానికి వస్తే.. లాల్ సలామ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో  విష్ణు విశాల్ సెకెండ్ లీడ్ రోల్ పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!