AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: ఎవరైనా నిన్ను అవమానిస్తే ఇలా చేయ్.. ఈ విషయం గుర్తుపెట్టుకో.. పూరి జగన్నాథ్..

కొన్నాళ్లుగా యూట్యూబ్‎లో పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాల మీద తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్, జీవితం, సక్సెస్, మనీ, కష్టం ఇలా ప్రతి విషయంలోనూ తన ఆలోచనల గురించి మాట్లాడుతుంటారు. తాజాగా INSULT అవమానం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

Puri Jagannadh: ఎవరైనా నిన్ను అవమానిస్తే ఇలా చేయ్.. ఈ విషయం గుర్తుపెట్టుకో.. పూరి జగన్నాథ్..
Puri Jagannadh
Rajitha Chanti
|

Updated on: May 09, 2024 | 7:43 PM

Share

డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఓవైపు ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారు పూరి. కొన్నాళ్లుగా యూట్యూబ్‎లో పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాల మీద తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్, జీవితం, సక్సెస్, మనీ, కష్టం ఇలా ప్రతి విషయంలోనూ తన ఆలోచనల గురించి మాట్లాడుతుంటారు. తాజాగా INSULT అవమానం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

“జీవితంలో చాలాసార్లు మనం అవమానానికి గురవుతుంటాం. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదోక మాట అంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధపడకూడదు. అప్పుడే హుందాగా ఉండాలి. ముందు ఎందుకు అవమానించారో అర్థం చేసుకోండి. ఏ సందర్భంలో అది జరిగిందో అర్థం చేసుకోండి. ఎవరు నిన్ను అవమానించారు ? నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తా ?.. నీ మేలు కొరుకునేవాడా ? నీ సహోద్యోగా? నీ బాస్ ఆ ? నీ శత్రువా ? ముక్కు మోహం తెలియనివాడా ? ఒక్కోసారి నీ కన్నతండ్రి కూడా నిన్ను అవమానించవచ్చు. నీకు పెట్టే తిండి కూడా దండగా అని తిట్టొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు ? ఏదైనా చిన్న విషయానికే నిన్ను అవమానించారా ? వ్యక్తిగత జీవితం గురించి చులకనగా మాట్లాడారా ?.. నీ జాతి గురించి కించపరిచేలా ఏమైనా అన్నారా ? నిన్ను ఎక్కడ అవమానించారు ? మీరు ఇద్దరే ఉన్నప్పుడూ ? లేదా పబ్లిక్ ప్లేస్ లోనా.. ? లేక సోషల్ మీడియాలోనా ? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలి.

మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే.. మౌనంగా ఉండండి. ఎందుకంటే అవతలి మనిషి కావాలనే నిన్ను అవమానిస్తాడు. వెంటనే నువ్వు కోప్పడితే ఎదుటివాడు గెలిచినట్టే. నువ్వు రియాక్ట్ అయితే ఆ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని.. నిన్ను ఇంకా రెచ్చగొడతాడు. అలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి. అది పవర్ ఫుల్ టూల్. అక్కడ ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. వాడిని మనం సీరియస్ గా తీసుకోలేదని వాడికి తెలియాలి. ఒకవేళ మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఇలా చెప్పండి. నన్ను అవమానించినందుకు థాంక్స్. ఇలా జరిగిన ప్రతిసారి నేను ఎదిగాను అని చెప్పండి. అవతలి వాడికి అర్థం కాదు. మిమ్మల్ని ఎవరు అవమానించినా వీలైనంతవరకు వదిలేయండి. సీరియస్ గా తీసుకోకండి.

ది బెస్ట్ రెస్పాన్స్ ఈజ్ నో రెస్పాన్స్. మీరు వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతే మిమ్నల్ని అవమానించినవాడు ఇంట్రెస్ట్ కోల్పోతాడు. కొన్నిసార్లు కొన్ని అవమానాల వల్ల మనం నిజంగా మారతాం. అవన్ని మనకు ఉపయోగపడతాయి. మీ మంచి కోరేవారు మిమ్మల్ని అవమానించినా ఎందుకు చేశారో ఆలోచించండి. ఎందుకు చేశారో ఆలోచించండి. అంతేకానీ వెంటనే రియాక్ట్ కాకండి. వాళ్లేదో అవమానిస్తే వెంటనే పంచ్ విసిరి అక్కడే వాళ్లను విన్ అవుదాం అని చెయ్యోద్దు. మనకు కావాల్సింది గెలవడం కాదు.. ఆ పరిస్థితిని మనం హ్యాండిల్ చేశామనేది ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. అవమానం ఎప్పుడూ మనలో కసి పెంచుతుంది. వాడి కంటే ఎదగాలి. వాడికంటే బాగుండాలి. అవమానం జరిగినప్పుడు ఆర్గ్యూ చేయ్యొద్దు. ఆ అవమానాన్ని గుండెల్లో పెట్టుకో. మనకు జరిగిన ప్రతి అవమానాన్ని సక్సెస్ కోసం వాడుకోవాలి. అనవసరంగా వాడితో గొడవ పెట్టుకుని వాదించి దానిని డైల్యూట్ చేయ్యొద్దు. అవమానం చాలా విలువైనది. దానిని భద్రంగా దాచుకో.. వాడుకో ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.