IPL 2024: ఓనర్ తీరుతో మనస్తాపం! లక్నోను వీడనున్న కేఎల్ రాహుల్! తిరిగి ఆ జట్టులోకే ఎంట్రీ
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోయింది. ఆ జట్టు విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే సాధించింది. ఈ దారుణ ఓటమితో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా నిరాశకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోయింది. ఆ జట్టు విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే సాధించింది. ఈ దారుణ ఓటమితో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చాలా నిరాశకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజి క మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో క్రికెట్ అభిమానులు లక్నో ఓనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో లక్నో ను వదిలి వెళ్ళమని KL రాహుల్‌కు సలహా ఇస్తున్నారు. ఈ ఘటనలో అందరూ కేఎల్ రాహుల్ వైపే ఉన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇలాంటి పెద్ద ఆటగాడితో ఇదంతా జరగకూడదని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కేఎల్ రాహుల్ వెంటనే లక్నో సూపర్ జెయింట్‌ను వీడి ఆర్సీబీలో చేరాలని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. ఆసక్తికరంగా, KL రాహుల్ తన IPL కెరీర్‌ను RCB జట్టుతో ప్రారంభించాడు, కానీ ఒక సీజన్ ఆడిన తర్వాత విడుదలయ్యాడు.
ఆర్సీబీలో చేరు బ్రో…
Come to RCB @klrahul 🙏❤️
ఇవి కూడా చదవండిKarnataka people thrive for local players like you in chinnaswamy, you’ll get the biggest cheer than any other RCB player, just join @RCBTweets and be the captain too 🥹pic.twitter.com/fnUJ69KpLs
— Stan RSY ᵀᵒˣᶦᶜ | ᴿᶜᴮ (@rsy_stan) May 9, 2024
అయితే కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తిట్టాడా? లేదా? అనేది ఇంకా తేలలేదు. అయితే, రాహుల్‌తో మాట్లాడుతున్నప్పుడు మాత్రం సంజీవ్ శైలి కాస్త దూకుడుగా ఉంది. పైగా కేఎల్ రాహుల్ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా వినడం లేదు. దీంతో క్రికెట్ అభిమానులు లక్నో ఓనర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు. ప్లేఆఫ్‌కు చేరుకోవాలన్న లక్నో ఆశలు ఇంకా తీరలేదు. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, రెండింటిలోనూ గెలిస్తే లక్నో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవచ్చు.
కేల్ రాహుల్, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాల సంభాషణకు సంబంధించిన వీడియో..
Sanjiv Goenka behaving so rude on KL Rahul in public infront of Cameras for the loss .
KLR should come out of this Shit franchise 🤦🏽♂️
Horrible. Disgusting. Pathetic. #SRHvLSG | #KLRahul | #SamPitroda pic.twitter.com/owiyOWr31K
— ஷிபின் Shibin ( மோடியின் குடும்பம் ) (@Shibin_twitz) May 9, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..