AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geethanjali Malli Vachindi: ఓటీటీలో అడుగుపెట్టిన గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. సుమారు పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, భయపెట్టిన గీతాంజలికి ఇది సీక్వెల్. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన వహించిన

Geethanjali Malli Vachindi: ఓటీటీలో అడుగుపెట్టిన గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Geethanjali Malli Vachindi
Basha Shek
|

Updated on: May 09, 2024 | 6:31 PM

Share

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. సుమారు పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, భయపెట్టిన గీతాంజలికి ఇది సీక్వెల్. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన వహించిన ఈ సెకెండ్ పార్ట్‌ లో శ్రీనివాసరెడ్డి, సత్య, సునీల్, రవి శంకర్, షకలక శంకర్, సత్యం రాజేశ్, అలీ, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ కీరోల్స్‌లో నటించారు. అంజలి కెరీర్ లో ఇది 50వ సినిమా కావడం విశేషం. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజైన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఆడియెన్స్ ను బాగానే నవ్వించి భయపెట్టింది. అయితే మొదటి పార్ట్ లాగే కథ, కథనాలు ఉండడంతో యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఈ కామెడీ హార్రర్ థ్రిల్లర్ అప్పుడే ఓటీటీలో ప్రత్యేక్షమైంది. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ( మే 08) సాయంత్రం నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘పార్ట్ 2 అంటే గట్టిగా పగబట్టి ఉండొచ్చు. మళ్లీ వచ్చిందంటా గీతాంజలి. చూడండి మరి’ అంటూ ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది.

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రానికి భాను భోగవరపు, నందు కథ అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కోన వెంకట్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. . పైగా ఇటీవల ఓటీటీలో హార్రర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. థియేటర్లలో ఆడని ఈ జోనర్ సినిమాలు ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. మరి థియేటర్లలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి

ఇవి కూడా చదవండి

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో అంజలి లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..