త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బిగ్ బాస్ ఫేమ్ తజికిస్థాన్ సింగర్ అబ్దు.. ప్రేమని కనుగొన్నా అంటూ వెల్లడి

అబ్దు రోజిక్ కాబోయే వధువు ఎవరు? ఆమె ఎక్కడ ? ఏమి చేస్తుందని వంటి వివరాల గురించి ఏమీ చెప్పలేదు.  అయితే పెళ్లి కూతురుకు సంబంధించిన సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఖలీజ్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం అబ్దు షార్జాకు చెందిన ఎమిరాటీ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె పేరు అమీరా.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బిగ్ బాస్ ఫేమ్ తజికిస్థాన్ సింగర్ అబ్దు.. ప్రేమని కనుగొన్నా అంటూ వెల్లడి
Abdu Rozik
Follow us
Surya Kala

|

Updated on: May 10, 2024 | 8:16 AM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాపులర్ టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ 16వ సీజన్ లో పాల్గొని తజికిస్థాన్ సింగర్ అబ్దు రోజిక్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సింగర్ అబ్దు రోజిక్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అబ్దు రోజిక్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ తన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వీడియోలో తనను గౌరవించే అమ్మాయి దొరికిందని చెబుతున్నాడు. అంతేకాదు తన సంతోషన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నాడు. తన అభిమానులందరికీ ఉంగరాన్ని చూపించాడు.

వీడియోను పోస్ట్ చేసిన తర్వాత అబ్దు రోజిక్ క్యాప్షన్‌లో “తాను అదృష్టవంతుడిని అని ఎప్పుడూ అనుకోలేదు.. తనకు దొరికిన ప్రేమను గౌరవిస్తానని.. తాను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేనుని వెల్లడించాడు. అబ్దు రోజిక్  పెళ్లి జూలై 7న తన వివాహం సమాచారం

అబ్దు రోజిక్ కాబోయే వధువు ఎవరు?

అబ్దు రోజిక్ కాబోయే వధువు ఎవరు? ఆమె ఎక్కడ ? ఏమి చేస్తుందని వంటి వివరాల గురించి ఏమీ చెప్పలేదు.  అయితే పెళ్లి కూతురుకు సంబంధించిన సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. ఖలీజ్ టైమ్స్‌లోని ఒక కథనం ప్రకారం అబ్దు షార్జాకు చెందిన ఎమిరాటీ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఆమె పేరు అమీరా.

అబ్దు రోజిక్‌కి యుఎఇలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్‌ షోలో పాల్గొనడానికి ముందు, అతను ఎమిరేట్ సిటీ దుబాయ్‌లో సల్మాన్ ఖాన్, AR రెహమాన్ సహా చాలా మంది బాలీవుడ్ తారలను కలిశాడు. తరువాత అతను ‘బిగ్ బాస్ 16’ షోలో పాల్గొన్నాడు. భారతదేశంలో కూడా ఫేమస్ అయ్యాడు. భారతీయులకు అబ్దు ఛోటే భాయిజాన్ అనే పేరుతో తెలుసు. సోషల్ మీడియా సంచలనం అబ్దుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.2 మిలియన్లు అంటే 82 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

మరిన్ని  ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..